చేష్ట‌ల్లో ఈయ‌న డాక్ట‌ర్ సుధాక‌ర్‌కు సోద‌రుడే!

టీడీపీ నేత ప‌ట్టాభి….మాట‌లోనూ, న‌డ‌వ‌డిక‌లోనూ  మ‌త్తు వైద్యుడు డాక్ట‌ర్ సుధాక‌ర్‌కు సోద‌రుడే. ఏబీఎన్‌, టీవీ5 త‌దిత‌ర చాన‌ళ్ల‌లో కూచొని గంట‌ల త‌ర‌బ‌డి ఏక‌పాత్రాభిన‌యం చేస్తుండ‌టం వ‌ల్ల నోటికి హ‌ద్దూ అదుపూ ఉండ‌దు. నోటికి ఏది…

టీడీపీ నేత ప‌ట్టాభి….మాట‌లోనూ, న‌డ‌వ‌డిక‌లోనూ  మ‌త్తు వైద్యుడు డాక్ట‌ర్ సుధాక‌ర్‌కు సోద‌రుడే. ఏబీఎన్‌, టీవీ5 త‌దిత‌ర చాన‌ళ్ల‌లో కూచొని గంట‌ల త‌ర‌బ‌డి ఏక‌పాత్రాభిన‌యం చేస్తుండ‌టం వ‌ల్ల నోటికి హ‌ద్దూ అదుపూ ఉండ‌దు. నోటికి ఏది వ‌స్తే అది, ఎంతొస్తే అంత మాట్లాడుతుంటార‌నే ఘ‌న కీర్తి సాధించాడు. టీడీపీకి చెందిన మ‌రోనేత గొట్టిపాటి రామ‌కృష్ణ  కూడా చ‌ర్చ‌ల్లో పాల్గొంటాడు. ఆయ‌న చాలా ప‌ద్ధ‌తిగా, నిబ‌ద్ధ‌త‌తో, సంస్కార‌వంతంగా మాట్లాడుతుంటాడు. ఈ రామ‌కృష్ణ చాలా ఏళ్లుగా పార్టీలో ఉంటున్న‌ప్ప‌టికీ…వివాద‌ర‌హితుడు, సంస్కార‌వంతుడు కావ‌డంతో పెద్ద‌గా గుర్తింపు పొంద‌లేక‌పోయాడు.

మంచికి ఎప్పుడూ ఆద‌ర‌ణ ఉంటుంది. ప్ర‌త్య‌ర్థులు సైతం అభిమానించే నేత గొట్టిపాటి రామ‌కృష్ణ‌. సొంత పార్టీ వాళ్లు సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేసే వ్య‌వ‌హార శైలి ప‌ట్టాభి సొంతం. త‌మ అధినేత చంద్ర‌బాబుతో పాటు లోకేశ్ దృష్టిలో ప‌డాల‌ని ప‌ట్టాభి ప్ర‌త్య‌ర్థుల‌పై అవాకులు చెవాకులు పేలుతుంటాడ‌నే విమ‌ర్శ‌లున్నాయి.

ఇటీవ‌ల పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ భారీ స్థాయిలో ఇసుక దోపిడీకి పాల్ప‌డు తున్నాడ‌ని ఓ చాన‌ల్ డిబేట్‌లో ప‌ట్టాభి ఆరోపించాడు. ఈ విష‌యం తెలిసి తాడేప‌ట్టిగూడెం వైసీపీ ఎమ్మెల్యే విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి, అక్క‌డి నుంచే ప‌ట్టాభికి ఫోన్ చేశాడు. త‌న‌పై ఏ ఆధారాల‌తో ఆరోప‌ణ‌లు చేశావ‌ని స‌ద‌రు ఎమ్మెల్యే గ‌ట్టిగా నిల‌దీశాడు. ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల ఆధారంగా ఆరోప‌ణ‌లు చేశానే త‌ప్ప ఆధారాలు లేవ‌ని ప‌ట్టాభి స‌మాధానం ఇచ్చాడు.  అలా కుద‌ర‌ద‌ని, తాను ఇసుక దోపిడీకి పాల్ప‌డ్డాన‌ని నిరూపిస్తే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌త్య‌నారాయ‌ణ స‌వాల్ విసిరాడు. ఒక‌వేళ నిరూపించ‌క‌పోతే మీరేం చేస్తారో చెప్పాల‌ని స‌వాల్ విసిరాడు. దీంతో ప‌ట్టాభి తోక ముడిచాడు.

టీవీ చ‌ర్చ‌ల్లో ప‌ట్టాభి ఉన్నాడంటే , అక్క‌డ గొడ‌వ జ‌ర‌గ‌కుండా ఉండ‌దు. ఇటీవ‌ల వైసీపీ అధికార ప్ర‌తినిధి నాగార్జున యాద‌వ్‌, ప‌ట్టాభి మ‌ధ్య ఓ చాన‌ల్‌లో ప‌ర‌స్ప‌రం బూతులు తిట్టుకునే వ‌ర‌కు వెళ్లింది. చెప్పుతో కొడ‌తాన‌ని నాగార్జున యాద‌వ్ అన్నా డంటే…చ‌ర్చ‌ల తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. ఇలా ఒక‌ట్రెండు కాదు…ప‌దుల సంఖ్య‌లో ప‌ట్టాభి గురించి ఉదాహ‌ర‌ణ‌లు చెప్పొచ్చు.

ఇక తాజా వ‌ష‌యానికి వ‌స్తే జ‌గ‌న్ స‌ర్కార్ తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ అయింద‌ని టీడీపీకి చెందిన ఓ నాయ‌కుడు ఆరోపించాడు. ఇలాంటి ఆరోప‌ణ‌లు చేసే ఆ నాయ‌కుడెవ‌రో చెప్ప‌డానికి పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఇలాంటి త‌లాతోకా లేని విమ‌ర్శ‌లు చేసే టీడీపీ నాయ‌కుల్లో ప‌ట్టాభి ఇటీవ‌ల అగ్ర‌స్థానంలో ఉన్నాడు. న‌రం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంద‌నేందుకు ప‌ట్టాభే నిలువెత్తు నిద‌ర్శ‌నం.

గత ఏడాది కృష్ణాలో వరదలు వస్తే రాయలసీమకు ఎందుకు తరలించలేదు? అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నాడు.  నర్సీపట్నం ఆస్ప త్రిలో మాస్కులు లేవని ప్రశ్నించడమే డాక్టర్‌ సుధాకర్‌ చేసిన తప్పా? డాక్టర్‌ అని కూడా చూడకుండా నడిరోడ్డుపై సుధాకర్‌ చొక్కా విప్పించి.. పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆయ‌న ఆరోపించాడు.  

ఇలా అర్థంప‌ర్థం లేకుండా మాట్లాడేవాళ్ల‌ను డాక్ట‌ర్ సుధాక‌ర్ సోద‌రుడిగా కాకుండా మ‌రో ర‌కంగా పిల‌వ‌డం ఎలా సాధ్యం?  తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ అయింది చంద్రబాబా లేక జ‌గ‌నా అనే విష‌యం ఏపీలో చిన్న‌పిల్లాడిని అడిగినా చెబుతారు. జీవో 203 జారీ చేసిందెవ‌రు?  దానిపై ఏమీ మాట్లాడ‌కుండా మౌనంతో తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌దెవ‌రో పాపం ప‌ట్టాభికి తెలిసిన‌ట్టులేదు.  రాష్ట్రంలో ఏం జ‌రుగుతున్న‌దో కూడా తెలియ‌ని మాన‌సిక స్థితిలో ప‌ట్టాభి ఉండ‌టం బాధాక‌రం.

గ‌త ఏడాది కృష్ణాలో వ‌ర‌ద‌లొస్తే వాటిని నిలువ చేసుకోవ‌డానికి క‌నీసం ఒక్క ప్రాజెక్టు అయినా సీమ వాసుల కోసం బాబు క‌ట్టారో లేదో తెలియ‌క‌పోవ‌డం ప‌ట్టాభి మాన‌సిక అప‌రిప‌క్వ‌త‌ను తెలియ‌జేస్తోంది. ఇక డాక్ట‌ర్ సుధాక‌ర్ న‌డిరోడ్డుపై ఎలా వ్య‌వ‌హ‌రించారో కూడా తెలుసుకోలేని అజ్ఞానాంధ‌కారంలో ప‌ట్టాభి కొట్టుమిట్టాడుతున్నాడా? ఏమిటీ మాట‌లు? ఏమిటీ చేష్ట‌లు?  క‌నీసం సొంత పార్టీ నేత గొట్టిపాటి రామ‌కృష్ణ‌ను చూసైనా కాస్త బుద్ధి తెచ్చుకోవ‌య్యా ప‌ట్టాభి. డాక్ట‌ర్ సుధాక‌ర్ అలియాస్ ప‌ట్టాభిగా ఎందుకు పిలిపించుకుంటావ్‌? అని టీడీపీ కార్య‌క‌ర్త‌లే హిత‌వు చెబుతున్నారు.

కేసీఆర్ న్యూ రూల్స్ అదుర్స్