ఆ దేశాల్లో క‌రోనా సెకెండ్ వేవ్.. ప‌రిస్థితి ఇలా

క‌రోనాకు ఇది వ‌ర‌కే ఒక‌సారి చెక్ పెట్టిన దేశాలుగా నిలిచాయి యూర‌ప్ దేశాలు. చైనా త‌ర్వాత క‌రోనా తీవ్రంగా వ్యాపించింది యూర‌ప్ దేశాల్లోనే. ప్ర‌త్యేకించి ఇట‌లీ, స్పెయిన్ దేశాలు మొద‌ట్లోనే క‌రోనాతో అత‌లాకుత‌లం అయిన…

క‌రోనాకు ఇది వ‌ర‌కే ఒక‌సారి చెక్ పెట్టిన దేశాలుగా నిలిచాయి యూర‌ప్ దేశాలు. చైనా త‌ర్వాత క‌రోనా తీవ్రంగా వ్యాపించింది యూర‌ప్ దేశాల్లోనే. ప్ర‌త్యేకించి ఇట‌లీ, స్పెయిన్ దేశాలు మొద‌ట్లోనే క‌రోనాతో అత‌లాకుత‌లం అయిన ప‌రిస్థితుల్లో నిలిచాయి. ప్ర‌పంచంలోని పెద్ద జ‌నాభా ఉన్న దేశాల్లో కూడా క‌రోనా వ్యాపించ‌క ముందే ఆ దేశాల‌ను క‌రోనా ఇక్క‌ట్ల పాల్జేసింది. స‌రిగ్గా ఎలాంటి వైద్యం అందించాల‌నే క్లారిటీ కూడా లేక‌పోవ‌డంతో ఆ దేశాల్లో క‌రోనా కార‌ణ మ‌ర‌ణాల సంఖ్య కూడా ఎక్కువ‌గా న‌మోదైంది.

మంచి వైద్య సౌక‌ర్యాలు ఉండే యూర‌ప్ లోనే అలాంటి ప‌రిస్థితి ఉందంటే ఇండియాలో ఆ వైర‌స్ ప్ర‌బ‌లితే ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందో అని మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో ఆందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. ఆ త‌ర్వాత సీన్ మారింది. యూర‌ప్ దేశాల్లో క‌రోనా వ్యాప్తి త‌గ్గింది. జూన్ మొద‌టి వారం నుంచినే అక్క‌డ క‌రోనా తీవ్ర‌త త‌గ్గింది. అదే స‌మ‌యంలో ఇండియాలో క‌రోనా వ్యాప్తి ఎక్కువైంది. 

యూర‌ప్ కంట్రీస్ ఒక్కోటి ఇప్ప‌టి వ‌ర‌కూ చూసిన‌న్ని క‌రోనా కేసుల‌ను ఇండియా ఒక్క రోజులోనే చూపిస్తోంది! ఇట‌లీలో న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య‌ను కూడా ఇండియా క్రాస్ చేసింది. ఇలాంటి క్ర‌మంలో.. యూర‌ప్ లో ప‌రిస్థితి ఏమిటి.. అంటే, అక్క‌డ క‌రోనా సెకెండ్ వేవ్ లో వ్యాపిస్తోంది.

ఇట‌లీ, స్పెయిన్, ఫ్రాన్స్ త‌దిత‌ర దేశాల్లో ఇప్పుడు క‌రోనా మ‌ళ్లీ పీక్స్ కు చేరింది! ఫ్రాన్స్ లో అయితే..మొద‌టి విడ‌త క‌న్నా ఇప్పుడు ఎక్కువ కేసుల న‌మోద‌వుతున్నాయి. రోజువారీగా నాలుగైదు వేల స్థాయిలో అక్క‌డ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇట‌లీలో రోజుకు 1500 పై స్థాయి కేసులు న‌మోద‌వుతున్నాయి. స్పెయిన్ లో ఫ‌స్ట్ వేవ్ క‌న్నా ప్ర‌స్తుతం న‌మోద‌వుతున్న రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. యూకేలో కూడా మ‌ళ్లీ రోజువారీగా కేసుల సంఖ్య పెరుతున్నాయి. 

జూలై నుంచినే యూర‌ప్ లో లాక్ డౌన్ రిలాక్సేష‌న్స్ పూర్తిగా ఇచ్చేశారు. అలాగే సెల‌వులు రావ‌డంతో.. జ‌నాల క‌ద‌లిక చాలా పెరిగింది. దీంతోనే క‌రోనా సెకెండ్ వేవ్ అందుకుంద‌ని నిపుణులు చెబుతున్నారు. 

అయితే గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. క‌రోనా కార‌ణ మ‌ర‌ణాల సంఖ్య మాత్రం అక్క‌డ బాగా త‌గ్గింది. మొద‌టి ద‌శ‌లో ఇలానే క‌రోనా కేసులు నంబ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు మ‌ర‌ణాల సంఖ్య తీవ్రంగా న‌మోదైంది. రెండో వేవ్ లో కేసుల సంఖ్య మొద‌టి క‌న్నా ఎక్కువ‌గా ఉంటున్నా.. మ‌ర‌ణాల సంఖ్య సింగిల్, డ‌బుల్ డిజిట్ స్థాయికి త‌గ్గింది. మరి క‌రోనాకు ఏ వైద్యం అందించాల‌నే స్ప‌ష్ట‌త వైద్యుల‌కు రావ‌డ‌మే దీనికి కార‌ణ‌మో లేక ఆ వైర‌స్ కే శ‌క్తి త‌గ్గిపోయిందో!

నిమ్మ‌గ‌డ్డ క‌మ్మోడు కాబ‌ట్టే…ఉతికి ఆరేసిన పోసాని

ప్రభాస్ 2 కోట్ల విరాళం