ఇప్పటికే నటుడు కమల్ హాసన్ తన రాజకీయ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సేవలు వాడుకుంటున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. కమల్ పొలిటికల్ పార్టీ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో కమల్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా రెడీ అవుతున్నారట కమల్. ఇలాంటి నేపథ్యంలో ఆయన పార్టీ బలోపేతానికి పీకే సేవలను వాడుకుంటున్నారట.
ఇప్పటికే కమల్ పార్టీకి పీకే స్ట్రాటజీలు అమలవుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్లి పీకేతో సమావేశం కావడం గమనార్హం. ముంబై వెళ్లి మరీ ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అయ్యారట రజనీకాంత్. ఈ హీరో రాజకీయం సంగతి అందరికీ తెలిసిందే. తను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేసినట్టుగా రజనీకాంత్ ప్రకటించారు.
ఇలాంటి నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ఈయన కూడా ఐప్యాక్ సేవలను వాడుకోనున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే తమిళనాట కమల్ పార్టీ కోసం పీకే పని చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు రజనీకాంత్ వెళ్లి ఆయనతో సమావేశం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఇద్దరి హీరోల పార్టీల్లో ఎవరికి పీకే సేవలను అందిస్తారనేది కూడా చర్చనీయాంశం అవుతోంది.
అయితే తమ అభిమాన హీరో రాజకీయానికి పదును పెడుతున్నారని, వెళ్లి సక్సెస్ ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో ఆయన సమావేశం అయ్యాడనే వార్తలు రజనీకాంత్ అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయని సమాచారం.