టాలీవుడ్ కు సంబంధించినంత వరకు రాబోయే సంక్రాంతి భలే మాంచి రంజుగా మారుతోంది. మూడు పెద్ద సినిమాలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇవి కాక ఓ మీడియం సినిమా కూడా రెడీ అంటోంది. రజనీ 'దర్బార్', మహేష్ 'సరిలేరు', బన్నీ 'అల' సినిమాలు కీలకంగా వున్నాయి. ఎవరు ముందు? ఎవరు వెనుక? అన్నది ఇప్పటికీ తేలడంలేదు.
సంక్రాంతి ట్రాక్ రికార్డు చూస్తుంటే గత కొన్నాళ్లుగా ముందు వచ్చిన సినిమాలు పెద్దగా క్లిక్ కావడంలేదు. దాంతో ఎవరికి వారు వెనకే రావడానికి చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బన్నీ సినిమా కు డేట్ 12 అంటూ ప్రకటించేసారు. రజనీ దర్బార్ సినిమా 10న వస్తోందని తెలుస్తోంది. ఇక మిగిలింది 11 లేదా 12 తేదీలు మాత్రమే.
11న సరిలేరు విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి హీరో మహేష్ బాబు అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. ఏకంగా 14న రిలీజ్ చేస్తే బెటర్ అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలా అయితే ముందు వచ్చిన సినిమాల ఓపెనింగ్ హడావుడి అయిపోతుంది. 14 ఫ్రెష్ డేట్ గా వుంటుంది. మరి దీనికి నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఏమంటారో? ఆయన ప్లాన్ ఏమిటో? చూడాలి.