ఎప్పుడో జనవరిలో సినిమా స్టార్ట్ అవుతుంది. పైగా కథేమో ఇంకా రెడీకాలేదని టాక్. కానీ సినిమా మీద హడవుడి మాత్రం మొదలయింది. ఇదంతా చూసి హీరోనే ఆశ్చర్యపోతున్నట్లు వినికిడి. విషయం ఏమిటంటే, హీరో గోపీచంద్ ప్రస్తుతం చాణక్య సినిమా చేస్తున్నారు. దీని తరువాత బోగవిల్లి ప్రసాద్ సినిమా స్టార్ట్ చేసి పూర్తిచేయాలి. ఆ తరువాతనే సంపత్ నంది సినిమా.
అయితే ఇప్పటి నుంచే తమన్నా హీరోయిన్ అంటూ ఇతరత్రా న్యూస్ వదలడం చూసి హీరో గోపీచంద్ నే ఇఫ్పటి నుంచీ ఏమిటీ హడావుడి? ఇంకా కథ సెకండాఫ్ కూడా రెడీ కావాలి కదా? అని సన్నిహితుల దగ్గర కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఈ కథ బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి వచ్చిందే. లేడీ కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, అనుకోని సంఘటనలో ఇన్వాల్వ్ కావడం, పరిణామాలు వగైరా. ఈ కథకు కాస్త భారీ ఖర్చు వుండడం, మార్పులు చేయాల్సి వుండడంతో బెల్లంకొండ నో అన్నట్లు తెలుస్తోంది. దాంతో అక్కడి నుంచి గోపీచంద్ దగ్గరకు వచ్చింది.
అంతవరకు బాగానే వుంది. కానీ ఎప్పుడో మార్చి తరువాత సినిమాకు ఇప్పుడెందుకు హడావుడి చేస్తున్నారు.. అన్నదే గోపీచంద్ క్యాంప్ లో వినిపిస్తున్న క్వశ్చను అని టాలీవుడ్ లో వినిపిస్తోంది.