ఆ రాష్ట్రంలో ఎన్నికలు.. నేతలపై కేసులు!

ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతలను ఒక్కొక్కరినీ జైలుకు పంపిస్తున్నారు బీజేపీ వాళ్లు. చిదంబరం తీహార్ జైల్లో ఉండగా, డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు బీజేపీ వ్యతిరేక నేతల్లో మరో…

ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతలను ఒక్కొక్కరినీ జైలుకు పంపిస్తున్నారు బీజేపీ వాళ్లు. చిదంబరం తీహార్ జైల్లో ఉండగా, డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు బీజేపీ వ్యతిరేక నేతల్లో మరో ఇద్దరు ప్రముఖులపై ఈడీ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు జాబితాలోకి ఎక్కారు శరద్ పవార్, అజిత్ పవార్. ఈ ఎన్సీపీ నేతలపై మనీ ల్యాండరింగ్ కు సంబంధించి కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది.

'సహారా స్కామ్'లో వీరిపై కేసులు పెట్టారని సమాచారం. త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పవార్ లపై కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని శరద్ పవార్ ప్రకటనలు చేసిన రెండు మూడు రోజుల్లోనే కేసులు నమోదు కావడం గమనార్హం.

అయితే మొన్నటి వరకూ భారతీయ జనతా పార్టీ వాళ్లు శరద్ పవార్ ను చాలా బాగా ఆదరించారు. ఆయనకు పద్మ అవార్డు దక్కింది కూడా మోడీ జమానాలోనే. ఎన్సీపీని సహాజమైన అవినీతి పార్టీ అంటూ మోడీ విమర్శిస్తూ వచ్చారు. అంతలోనే ఆయనకు మోడీ సర్కారే  పద్మఅవార్డుల్లో పెద్ద పురస్కారాన్నే అందించింది. ఇప్పుడు మళ్లీ ఈడీ కేసులు పెట్టిందట!

సైరాపై డైరెక్టర్ అంచనాలేంటి..?