ధర్మాన గుస్సా వెనక?

ఉత్తరాంధ్రాలో సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన  తన జిల్లాకు వచ్చిన మంత్రి ఆళ్ళ నాని సమక్షంలో హ‌ఠాత్తుగా ఫైర్ అవడం పెద్ద రచ్చనే రేపుతోంది. వైసీపీ…

ఉత్తరాంధ్రాలో సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన  తన జిల్లాకు వచ్చిన మంత్రి ఆళ్ళ నాని సమక్షంలో హ‌ఠాత్తుగా ఫైర్ అవడం పెద్ద రచ్చనే రేపుతోంది. వైసీపీ పాలనలో కూడా డెప్యుటేషన్ మీద కూడా జిల్లాలో వైధ్య శాఖ సిబ్బందిని  నియమించుకోలేకపోతే  ఆరోగ్య శాఖ ఎందుకు అంటూ   ధర్మాన బాగా మండిపోయారు.

ఆ సమీక్షా సమావేశంలో  స్వయాన అన్నగారు అయిన మంత్రి  ధర్మాన క్రిష్ణదాస్  కూడా వేదిక మీదనే ఉన్నారు. ధర్మాన అధికారులను నిలదీస్తున్నట్లుగా వేసిన బాణాలూ, చేసిన విమర్శలు అన్నీ కూడా ఎవరికి తగలాలో వారికే అన్నట్లుగానే తగిలాయి.

ధర్మాన ఇలా వైసీపీ  ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంలో ఆగ్రహించడం, అధికారులనే తప్పుపడుతున్నట్లు ఉన్నా వెనక ప్రభుత్వానికి కూడా ఆ బాణం దెబ్బలు తగలడం అంతా వ్యూహాత్మకమేనా అంటూ చర్చ సాగుతోంది. అధికారులు పాలిస్తే ప్రజాప్రతినిధులు ఎందుకు అంటూ ధర్మాన ప్రదర్శించిన ఆవేశం  వెనక అసంత్రుప్తి బాగా  ఉందని అంటున్నారు.

మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ధర్మాన అనుకున్నారు. ఆయన ఆశలు నెరవేరకుండాఏ వైసీపీ అధికారంలోకివచ్చి ఏడాది గడచింది. సరే ఆయన చేసిన విమర్శలలో సహేతుకత ఉండొచ్చు కానీ ఇలా బహిరంగంగా ఆయన రెచ్చిపోయారంటే దానికి బోలేడు రాజకీయమే ఉందని అంటున్నారు. మరి ధర్మానది ధర్మాగ్రహమని అనుచరులు అంటున్నారు. ఆ ఆగ్రహం సంగతేంటో వైసీపీ పెద్దలే చూడాలి.

8 నుంచి శ్రీవారి దర్శనం

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు