Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మారుతికి పుత్రికోత్సాహం

మారుతికి పుత్రికోత్సాహం

ఎంత పేరున్న దర్శకుడు అయినా నాన్న నాన్నే.  పిల్లల ప్రతిభకు చిన్న గుర్తింపు వచ్చినా, తాము పెద్ద హిట్ కొట్టినంత ఆనందం. దర్శకుడు మారుతికి ఇద్దరు పిల్లలు, కొడుకు మ్యూజిక్ లో చిన్న వయసులోనే గట్టి సాధన చేస్తున్నాడు. కూతురు ఇటు ఫొటోగ్రఫీ, అటు పెయింటింగ్ ఇవి చాలక సరదాగా నటన. మారుతి డాటర్ హియ పెయింటింగ్ లు, ఫోటొలు ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ వుంటుంది. పెయింటింగ్ ల్లో రకరకాల టెక్నిక్ లు ఫాలో అవుతూ, ప్రాక్టీస్ చేస్తుంటుంది.

అదే సమయంలో ఫోటొగ్రఫీలో డిఫరెంట్ ప్రయోగాలు చేయడం అలవాటు. ఇటీవల ఓ ప్రయోగం చేసింది ఆమె. కేవలం మొబైల్ లైటింగ్ లో, డార్క్ మోడ్ లో రెండు ఫొటొలు క్లిక్ చేసి ఇన్ స్టాలో ఫొస్ట్ చేసింది. ఈ ఫోటొలకు అనుకోని అభినందన ఓ టాప్ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ నుంచి  లభించడంతో హియా ఇప్పుడు ఆనందంతో పొంగిపోతోంది. హాలీవుడ్ ఫేమస్ ఫొటోగ్రాఫర్ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డ్యాన్ లాస్సేన్ ఈ రెండు ఫొటోలను లైక్ చేసి, హియాను ప్రత్యేకంగా అభినందించారు. 

ఈ విషయాన్ని మారుతి తన సోషల్ నెట్ వర్క్ ఖాతాల్లో పోస్ట్ చేసారు. దీనికి సినిమా జనాలు అంతా స్పందించి అభినందించారు. 

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?