Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇండస్ట్రీ ఒకటి కావడం అంటే బూతు-వర్మ

ఇండస్ట్రీ ఒకటి కావడం అంటే బూతు-వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఓ వైవిధ్యమైన వ్యక్తిత్వం. ఆయన మాటలు భలే సూటిగా, సుత్తిలేకుండా వుంటాయి. ఈ రోజు ఆయన  ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కుండ బద్దలు కొట్టినట్లు కొన్ని విషయాలు చెప్పారు.

-ఇండస్ట్రీలో అందరూ ఒకటి కావడం అంటే పెద్ద బూతు. కళామతల్లి, అందరూ ఒకటి కావడం వంటివి ఇలాంటివి జరిగేవి కాదు. ఎందుకంటే ఇక్కడ వేరు వేరు సినిమాలు వేరు వేరు ప్రాజెక్టులు. ఒకరంటే మరొకరికి పడదు.

-మీటింగ్ ల్లో ఒరిగేది ఏమీ వుందు. కాఫీ టీలు తాగడం తప్ప, డెసిషన్ మేకింగ్ అనేది జరగదు.

-ఇన్ని సార్లు వెలువడిన అన్ని నిబంధనల్లో సినిమా హాళ్ల ప్రస్తావన వుందేమో కానీ షూటింగ్ ల ప్రస్తావన ఎక్కడా లేదు. బహుశా షూటింగ్ లను ప్రభుత్వం గుర్తించలేదేమో?

-షూటింగ్ ల్లో జాగ్రత్తలు అన్నది కష్టమే. ఎవరు చూస్తారు? పోలీసులను పెడతారా? గార్డులను పెడతారా? ఎవరి పని  వారు చేసుకుంటూ వుంటారు తప్ప ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా? లేదా? అన్నది ఎవరు చూస్తారు?

-థియేటర్ల వ్యవహారం కూడా అలాగే వుంది. సీట్లు తగ్గిస్తే ఎలా? టికెట్ రేట్లు పెంచాలా? పెంచితే జనం వస్తారా?  ఇవన్నీ అనుమానమే.

-నేను గాంధీని కించపర్చను. పబ్లిక్ డొమైన్ వున్న డాక్యుమెంట్ల ఆధారంగా గాడ్సే సినిమా స్క్రిప్ట్ తయారుచేస్తున్నా. సెన్సారు సమస్యలు వస్తాయని అనుకోవడం లేదు.

-అందరూ నన్ను తాగుబోతు ఇలా అలా అంటూ తిడుతూ వుంటే, నేను ఓడ్కా సిప్ చేస్తూ, హ్హ..హ్హ..హ్హ అనుకుంటూ వుంటా...ఓడ్కాకు ఇవి నాకు స్నాక్స్ అనుకుంటా.

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?