మందు ప‌డితే మ‌త్తు మాట‌లు…లేదంటే మాయ మాట‌లు!

మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడిపై వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు మాట‌ల దాడి తీవ్రం చేశారు. ముఖ్య మంత్రి, మంత్రుల‌పై అయ్య‌న్న‌పాత్రుడు అనుచిత వ్యాఖ్య‌లను అధికార పార్టీ వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది.  Advertisement మాట‌కు మాటే జ‌వాబు…

మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడిపై వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు మాట‌ల దాడి తీవ్రం చేశారు. ముఖ్య మంత్రి, మంత్రుల‌పై అయ్య‌న్న‌పాత్రుడు అనుచిత వ్యాఖ్య‌లను అధికార పార్టీ వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. 

మాట‌కు మాటే జ‌వాబు అనే రీతిలో అధికార పార్టీ నేత‌లు త‌మ విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టారు. ఈ నేప‌థ్యంలో విశాఖ జిల్లా చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ విసిరిన పంచ్ హైలెట్‌గా నిలిచింది.

అయ్యన్న నీతి మాటలు వింటే దెయ్యాలు గుర్తుకొస్తున్నాయన్నారు. కోట్లాది రూపాయలు అక్రమాస్తులు సంపాదించార‌ని , అయ్యన్న బండారం అందరికీ తెలుసని ధర్మశ్రీ  విమర్శించారు.  

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌ల‌ను అయ్య‌న్న ఉపసంహరించుకోవాల‌ని ధ‌ర్మ‌శ్రీ డిమాండ్ చేశారు. లేదంటే తగిన విధంగా బుద్ధి చెప్తామని ఆయ‌న‌ హెచ్చరించారు.

రంగు రాళ్ల కుంభ కోణంలో అయ్యన్న దోపిడి అందరికీ తెలుసన్నారు. కరక క్వారీ తవ్వకాల్లో అయ్యన్న రంగు ఎప్పుడో బయటపడిందని అన్నారు. 

మందు ఉంటే మత్తు మాటలు, మందు లేకపోతే మాయమాటలు అయ్యన్నకు అలవాటేన‌ని ధ‌ర్మ‌శ్రీ అదిరిపోయే పంచ్ విసిరారు.  ఈ పంచ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.