కరోనా థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో.. వ్యాక్సిన్ల గురించి వివిధ అధ్యయనాలు గందరగోళానికి గురి చేస్తూ ఉన్నాయి. వ్యాక్సిన్ల ప్రభావం గురించి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ అధ్యయనాలు, ఇండిపెండెంట్ స్టడీస్.. తలా ఒక మాట చెబుతున్నాయి.
ప్రభుత్వ అధ్యయనాలే ప్రజలను గందరగోళానికి గురి చేసేలా ఉండటం గమనార్హం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో.. ప్రస్తుతం ఇండియాలో వేస్తున్న వ్యాక్సిన్లు డెల్టా, డెల్టా ప్లస్ కరోనా వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తాయని చెబుతోంది!
ఇక ఇదే సమయంలో ఐసీఎంఆర్ ఒక స్టడీ చేసిందట. దాని ప్రకారం.. డబుల్ డోస్ వ్యాక్సిన్ పొందిన వారిలో కూడా ఏకంగా 76 శాతం మందికి కరోనా సోకిందట. అది డెల్టా వేరియెంట్ కరోనా. వారిలో దాదాపు పదిశాతం మంది హాస్పిటలైజ్ అయినట్టుగా ఈ అధ్యయనంలో తేలిందట! డబుల్ డోసేజ్ తర్వాత కూడా అటు ఇటుగా పది శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సి రావడం అంటే.. దీన్నెలా అర్థం చేసుకోవాలో మరి! సాధారణంగానే కరోనా కారణంగా పది శాతం మంది ఆసుపత్రి పాలవుతున్నారు.
సెకెండ్ వేవ్ లో కూడా దాదాపు అదే జరిగింది. వ్యాక్సిన్ ఊసే లేని సమయంలోని ఫస్ట్ వేవ్ లో పది శాతానికి మించి హాస్పిటలైజ్ కాలేదు! మరి రెండు డోసుల తర్వాత కూడా ఆసుపత్రి పాలయ్యే వారి శాతం, అస్సలు వ్యాక్సిన్ వేసుకోని వారితో సమానంగా ఉండటం గమనార్హం.
ఇక ఈ వ్యాక్సిన్ల గురించి ఇంకో వ్యాక్సినోలజిస్ట్ చెప్పిన విషయం ఆలోచనాత్మకంగా ఉంది. డాక్టర్ రాబర్ట్ మలోని అనే వ్యాక్సినోలజిస్ట్ ప్రయోగాత్మక దశల్లో ఉన్న వ్యాక్సిన్లను ప్రజలకు బలవంతంగా ఇవ్వొద్దు అని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ పేరుతో ప్రభుత్వాలు ప్రజలపై ప్రయోగం చేస్తున్నాయని ఆయన అంటున్నారు. ప్రత్యేకించి ఒక సారి కోవిడ్ కు గురై కోలుకున్న వారు వ్యాక్సిన్ వేయించుకోకపోవడం మంచిదనేది ఆ పరిశోధకుడి సలహా.
మలోనీ థియరీని కొందరు సామాజికవేత్తలు కూడా ప్రస్తావిస్తున్నారు. ఒకసారి కరోనాకు గురై కోలుకున్న వారికి సొంతంగా ఆ శక్తి ఉందని రుజువైనట్టే. అలాంటప్పుడు మళ్లీ వ్యాక్సిన్ ఎందుకనేది ఆలోచించాల్సిన అంశమే. ఈ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై ప్రభావం ఏ మేరకు చూపిస్తాయనేది ఇంకా రుజువు కాని అంశం అవుతున్నప్పుడు.. మలోని వంటి వారి థియరీలకు ప్రాధాన్యత లభిస్తుంది.
ఇండియాలో వ్యాక్సిన్లు ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి లేకపోయినప్పటికీ.. వ్యాక్సిన్ల గురించి వార్తలను, విశ్లేషణలను పరిశీలిస్తే మాత్రం మొత్తం గందరగోళమే మిగులుతుంది.