వెనుకబడిన రాయలసీమలో హైకోర్టు పెట్టాలంటారా…! మీకు మతివుందా..!!
Advertisement
కునారిల్లుతున్న ఉత్తరాంధ్రలో పాలనా రాజధాని పెట్టాలంటారా..! మీకు మతివుందా..!!
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించిన వ్యక్తిని ఓడించి… ఎవరినో 151 స్థానాలతో గెలిపిస్తారా..! మీకు మతివుందా..!!
అమరావతిలో భూములు కొని కోట్లకు పడగెత్తాలని అనుకుంటే…మా ఆశల సౌధాన్ని కూల్చేస్తారా..! మీకు మతివుందా..!!
ఈ రాష్ట్ర ప్రజలు మాకు బానిసలు కాదంటారా… మాకు ఊడిగం చేయనంటారా..! మీకు మతివుందా..!!
ఆదిమూలం శేఖర్