ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే మార్గంలో ఉన్నారు. పెన్షన్ మూడువేలు చేస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకిరాగానే రూ.250 పెంచి, ఇప్పుడు మరో 250 పెంచారు.
ఈ ప్రభుత్వం పదవీకాలం పూర్తయ్యేలోగా పెన్షన్లను మూడువేలు చేసి మాట నిలబెట్టుకుంటారనే భరోసాను ప్రజలకు కలిగించారు. ఈ విషయంలో అటు పెన్షన్ దారులు గానీ, ప్రజలు గానీ.. ఎవ్వరిలోనూ ఎలాంటి అనుమానం గానీ, అసంతృప్తి గానీ లేదు. కానీ తెలుగుదేశం ఈ విషయంలో నానా యాగీ చేయడానికి ప్రయత్నిస్తోంది.
మూడేళ్లలో పెంచింది రూ.250 మాత్రమేనా.. అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ రంకెలేస్తున్నారు. పెన్షనర్లను జగన్ మోసం చేస్తున్నారని అంటున్నారు. అచ్చెన్నాయుడు ఎంతగా బుర్ర లేని నాయకుడు అయినప్పటికీ.. ఇలాంటి మాటలు అనడానికి అంత నిస్సిగ్గుగా నోరెలా వస్తుందో అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.
పెన్షన్ల విషయంలో.. 2019కి పూర్వం జగన్మోహన్ రెడ్డి రెండువేలు చేస్తానని అన్నందుకు భయపడి.. ఆ ఓటు బ్యాంకు అంతా జగన్ పరం అవుతుందేమోనని భీతితో చంద్రబాబు రెండువేలు చేశారు. ఆయన అలా చేయడానికి ముందే.. ‘చంద్రబాబు గనుక.. రెండు వేలు చేస్తే.. నేను మూడు వేలు చేస్తా..’ అని ప్రకటించిన జగన్- సునాయాసంగా అధికారంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోగా ఖచ్చితంగా మూడువేలు అయితీరుతుందనే అభిప్రాయాన్ని అందరికీ కలిగిస్తున్నాడు. ఇందులో తెలుగుదేశానికి కలుగుతున్న నొప్పి ఏమిటో అర్థం కాని సంగతి.
అసలు ప్రజలకు ఏదైనా హామీ ఇస్తే.. దానిని విడతల వారీగా నెరవేర్చవచ్చుననే అభిప్రాయాన్ని తొలుత కల్పించింది చంద్రబాబునాయుడే అనే సంగతి ప్రజలకు తెలియనిది కాదు కదా! రైతులకు రుణమాఫీ చేస్తాననే ఒక బూటకపు హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు.. దానిని విడతలుగా చెల్లించే ఆలోచన చేశారు. చేసినా పర్లేదు.. కానీ దానిని అయిదేళ్ల పదవీకాలంలోనూ పూర్తిచేయకుండానే దిగిపోయారు. తాను రైతుల అప్పులను పెండింగులో పెట్టేసి వెళ్తే.. తాను తిరిగి ఎన్నికైతే తప్ప.. అవి తీరవు అనే భయంతో రైతులు తనకు ఓటు వేస్తారని ఆయన కుట్రఆలోచన చేశారు. కానీ రైతులు సరిగ్గానే బుద్ధి చెప్పారు.
అలాంటిది.. విడతలుగా చెల్లించే ఆలోచన చేసి.. పూర్తిగా చెల్లించకుండానే మోసం చేసిన చంద్రబాబునాయుడు.. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడ ప్రభుత్వాన్ని నిలదీసే నైతిక హక్కు ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పదవీకాలంలోగా హామీని పూర్తి చేసే దిశగానే అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు లాగా మాయోపాయంతో ఎగవేసే ఉద్దేశంతో లేరు. అలాంటప్పుడు.. ఇందులో కూడా లోపాలు వెతుకుతున్నట్టుగా వక్రబుద్ధితో తెలుగుదేశం నాయకులు విమర్శలు చేస్తోంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.