విటాలిక్ బ్యుటేరిన్ మన కళ్ళు తెరిపిస్తాడా?

విటాలిక్ బ్యుటేరిన్ – ఈ పేరు ఎప్పుడైనా విన్నామా మనం? ఇతీరీయం అనే క్రిప్టో కరెన్సీ సృష్టికర్త. ఆయనకు మన దేశానికి ఏమి సంబంధం? ఏమీ లేదు. భారత దేశాన్ని ప్రపంచ మ్యాపులో చూసి…

విటాలిక్ బ్యుటేరిన్ – ఈ పేరు ఎప్పుడైనా విన్నామా మనం? ఇతీరీయం అనే క్రిప్టో కరెన్సీ సృష్టికర్త. ఆయనకు మన దేశానికి ఏమి సంబంధం? ఏమీ లేదు. భారత దేశాన్ని ప్రపంచ మ్యాపులో చూసి ఉండొచ్చు. 

భారతీయుల పైన ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. కానీ, ఈ కరోనా మహమ్మారి చేస్తున్న విలయ తాండవం అతన్ని అక్షరాల పది వేల కోట్లను (1.5 బిలియన్ డాలర్లు) దానం చేసే అంతటి బాధను కలిగించింది. మానవత్వం పరిమళిస్తుంది ఇలాంటి మనుషులతో.

కానీ, మన సినిమా స్టార్లు? తమ సొంత అభిమానుల నుండి వంద రూపాయలు చేసే ఒక్కో టికేటుకు 1500 నుండి రెండు వేల రూపాయలు కొల్లగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏడ్చే స్టార్లను చూశాం, వంతబలికే మాజీ ముఖ్యమంత్రులను, జాతీయ పార్టీ నాయకులను చూశాం. ఈ స్టార్లు అందరూ కలిసి కనీసం ఒక కోటి రూపాయలన్నా తెలుగు రాష్ట్రాలకు ఇచ్చారా?

ప్రజలు ఆక్సిజన్ మందులు డాక్టర్లు బెడ్లూ లేక పిట్టల్లా రాలిపోతుంటే రియల్ మెన్ ఛాలెంజ్ అని ఇంట్లో చిన్న చిన్న పనులు చెయ్యడం, అమ్మకు దోశ వేశానని పోస్టులు పెట్టడం, రజనీకాంతుతో సెల్ఫీలు పెట్టడం – వీటిని పిచ్చి జనాలు వైరల్ చెయ్యడం. 

ఏమి దరిద్రం రా ఇది? సొంత తల్లిదండ్రులను కనీసం దహన సంస్కారాలు కూడా చెయ్యలేని స్థితిలో ఉండి కూడా ఈ పిచ్చి జనాలు ఇలానే ప్రవర్తిస్తుంటే ఈ రంగులేసుకునే స్టార్లు ఎందుకు మారుతారు, ప్రజల గురించి ఎందుకు జాలిచూపుతారు? స్వార్థ లంచగొండి రాజకీయ నాయకులను మనం ఎంతగా చీదరించుకుంటామో అంతకంటే వీళ్ళను అసహ్యించుకోవాలి. ఈ దరిద్రులను మనం దరిదాపుల్లోకి కూడా రానీవ్వకూడడు.

STOP WATCHING TELUGU MOVIES – NOW!

గురవా రెడ్డి, అట్లాంటా