ఒమిక్రాన్ భయం రెట్టింపు…?

ఒమిక్రాన్..గుండె దడ పుట్టిస్తోంది. భయం రేకెత్తిస్తోంది. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో కనిపించింది కదా అని నిదానించినంతసేపు పట్టలేదు. అది భారత్ లో కూడా మెల్లగా ఎంట్రీ ఇచ్చింది. కేసులు కూడా బాగానే పెరుగుతున్నాయి. Advertisement…

ఒమిక్రాన్..గుండె దడ పుట్టిస్తోంది. భయం రేకెత్తిస్తోంది. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో కనిపించింది కదా అని నిదానించినంతసేపు పట్టలేదు. అది భారత్ లో కూడా మెల్లగా ఎంట్రీ ఇచ్చింది. కేసులు కూడా బాగానే పెరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలో విదేశాల నుంచి ఏపీలోకి అడుగు పెట్టే ప్రయాణీకుల మీద పది కళ్ళు వేయాలన్న ఆదేశాలు ప్రభుత్వాల నుంచి వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ నెలలో  కేవలం పది రోజుల వ్యవధిలో ఏకంగా పన్నెండు వేల పై చిలుకు మంది విదేశాల నుంచి ఏపీకి వచ్చారని అధికారులు చెబుతున్నారు.

అయితే  వీరిలో మూడవ వంతు మంది ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి. వారి వివరాలు తెలియడం లేదు. అయితే వీరిలో బిగ్ నంబర్ గా విశాఖ జిల్లా ఉందని అంటున్నారు. 1700 మంది దాకా ఈ పది రోజుల్లో విశాఖకు విదేశాల నుంచి వచ్చినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి.  

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ ఉందన్న భయంతో కొంత హడావుడి జరిగింది. చివరికి ఆయనకు ఏమీ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే అందరికీ కరోనా పరీక్షలు చేయాలి. కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని అధికారులు స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నా కూడా చాలా మంది వివరాలు చెప్పకుండా ఫోన్లు ఆపేసుకోవడంతోనే ఒమిక్రాన్ భయం రెట్టింపు అవుతోంది. ఇంతకీ ఇలా గాయబ్ అయిన వారిలో ఎంతమందికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నాయో అన్న కంగారుతో జనాలు, అధికారులూ ఉన్నారట.