తెలుగుదేశం పార్టీ ఇపుడు ఎన్నడూ లేనంత రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడి రెండేళ్ళు గడచినా కూడా పార్టీకి వరస అపజయాలే పలకరిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో అధినాయకత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా నాయకులకు మింగుడుపడడంలేదు అంటున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశానికి కంచుకోటలాంటి ఉత్తరాంధ్రా జిల్లాల్లో పలువురు సీనియర్ నాయకులు పక్క చూపులు చూస్తున్నారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.
వీరిలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా ఉన్నారని అంటున్నారు. అలాగే, పార్టీలో పెద్ద పదవి నిర్వహించి ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్న ఒకాయన కూడా సైకిల్ దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు కూడా టీడీపీ గోడ దూకి వైసీపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ మేరకు వైసీపీలో ఒక సీనియర్ నేత చక్రం తిప్పుతున్నారని భోగట్టా. అంటే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ అయిపోయింది. మరి ఎంతమంది అటు నుంచి ఇటు వస్తారు అన్నదే చూడాలి. టీడీపీ నుంచి పెద్ద నంబర్ నే వైసీపీ టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. అదే జరిగితే టీడీపీలో భారీ భూకంపమే పుడుతుంది అంటున్నారు.