రూటు మార్చిన ఈటల.. విమర్శలు, వార్నింగులు

మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ స్వరం మారింది. తన నుంచి వైద్యారోగ్య శాఖను వెనక్కి తీసుకున్న వెంటనే ఈటల తన మాటలకు పదునుపెట్టారు.  Advertisement పార్టీకి రాజీనామా చేస్తానని పరోక్షంగా ప్రకటించడంతో…

మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ స్వరం మారింది. తన నుంచి వైద్యారోగ్య శాఖను వెనక్కి తీసుకున్న వెంటనే ఈటల తన మాటలకు పదునుపెట్టారు. 

పార్టీకి రాజీనామా చేస్తానని పరోక్షంగా ప్రకటించడంతో పాటు.. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరికలు కూడా జారీ చేశారు. మంత్రి పదవి పోయిన తర్వాత ఈటల ఏమమన్నారో, ఆ మాటల్ని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాం.

– ఇవన్నీ ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కంప్లయింట్ ఇచ్చిన తర్వాత ఎంక్వయిరీ జరిగి న్యాయం-అన్యాయం తేల్చకుండా.. ముందుగానే అన్నీ ఫిక్స్ చేసి జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

– ప్రస్తుతానికి నేనింకా పూర్తిస్థాయిలో అప్ డేట్స్ తెలుసుకోలేదు. నాపై ఎవరు కుట్ర చేస్తున్నారనే విషయం కచ్చితంగా తెలుసుకుంటాను.

– నాపై ఇంత కుట్ర జరుగుతుందనే విషయం నాకు తెలుసు. నేను రోజూ కరోనా నివారణ చర్యలు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాను. అందుకే దృష్టి పెట్టలేదు. నిన్నట్నుంచి ఏవేవో జరుగుతున్నాయి. ఇవన్నీ విశ్లేషించి ఓ నిర్ణయం తీసుకుంటాను.

– నా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాను. ఈ పరిస్థితుల్లో ఇంకా ఏమైనా పరిణామాలు ఉత్పన్నమైతే, కార్యకర్తలతో చర్చించి మాట్లాడతా.

– పార్టీలో ఒక్కటే కొట్లాడాడు. 20 ఏళ్లుగా పార్టీని పట్టుకొని ఏడ్చాడు. అలాంటి ఈటలకే ఈ గతి పట్టింది. ఈ పరిణామం మంచిది కాదనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంది. 20 ఏళ్లలో చేయని తప్పుల్ని, ఇప్పుడు చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? ఉద్యమం టైమ్ లో రాజకీయ ప్రలోభాలకే లొంగని నేను, ఇప్పుడు తప్పుచేస్తానా?

– నాపై జరుగుతున్న ఈ ప్రచారానికి, తప్పుడు కథనాలకు ప్రజలే బాధపడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నాపై జరుగుతున్న ఈ కుట్రలకు భవిష్యత్తులో కచ్చితంగా మూల్యం ఉంటుంది.