దేశంలో ఏ రాష్ట్రానికి లేని అద్భుతమైన వలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ కు వుంది. నిజానికి ఇంతటి నెట్ వర్క్ వుంటే ఏ అసాధ్యమైన పనులు అయినా ఇట్టే సాధ్యం అవుతాయి.
కరోనా తొలిదశలో సిఎమ్ జగన్ ఈ వలంటరీ వ్యవస్థను అద్భుతంగా వాడుకున్నారు. కానీ మలిదశలో ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు.
పింఛను ఇంటికి ఇస్తున్నారు. రేషన్ ఇంటికి ఇస్తున్నారు. ఇదంతా వలంటరీ వ్యవస్థ వల్లే సాధ్యం. అలాగే వ్యాక్సినేషన్ కూడా ఇంటికే చేర్చే ఆలోచన ఎందుకు చేయడం లేదో? వ్యాక్సినేషన్ కోసం కేంద్రాలు ఏర్పాటు చేయడం, అక్కడ భయంకరంగా జనం మూగడం, దాని వల్ల మరింతగా కరోనా వ్యాప్తి చెందడం కన్నా ఇది మంచిది కదా?
గ్రామాల లెక్కలు అన్నీ పక్కాగా సచివాలయాల్లో వున్నాయి. వరుసగా ఒక్కో గ్రామం వ్యాక్సినేషన్ చేసుకుంటూ వెళ్లడానికి ఈ వలంటరీ వ్యవస్థను వాడుకుంటే బాగుంటుంది కదా? జనాలు బయటకు రాకుండా ఇళ్లకే వెళ్లి టీకాలు వేస్తే సరిపోతుంది కదా? దశాబ్దాల కిందట నిజానికి ఇలాగే ఇళ్లకు వచ్చి టీకాలు వేసేవారు.
ఇప్పుడు కూడా అలాంటిది ఆలోచిస్తే బెటర్. ఈ రిజిస్ట్రేషన్లు, గుమి కూడడాలు ఇలాంటివి ఏవీ లేకుండా.