విద్యా కానుక.. వృథా కాకుండా..

రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకోసం ఉచితంగా యూనిఫామ్, షూస్, సాక్సులు, పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్.. ఇలా ఓ కిట్ తయారు చేసి ఇస్తోంది ప్రభుత్వం. జగనన్న విద్యా కానుక పేరుతో ఇస్తున్న ఈ…

రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకోసం ఉచితంగా యూనిఫామ్, షూస్, సాక్సులు, పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్.. ఇలా ఓ కిట్ తయారు చేసి ఇస్తోంది ప్రభుత్వం. జగనన్న విద్యా కానుక పేరుతో ఇస్తున్న ఈ కిట్ ని ఈపాటికే విద్యార్థులకు ఇవ్వాల్సి ఉన్నా.. కరోనా కారణంగా పలు దఫాలు వాయిదా పడింది.

అయితే విద్యార్థుల కొలతలు తీసుకుని చాలా కాలం అవుతోంది. ఎదిగే పిల్లలతో వారి బట్టల సైజ్ లు, షూ సైజ్ లు మారిపోయే అవకాశం ఉండటంతో వెంటనే వాటిని పిల్లలకు ఇచ్చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

రాష్ట్రంలో కరోనా ప్రభావం కాస్త తగ్గిందని అనుకుంటున్నా.. ఇటీవల ఓ ప్రభుత్వ పాఠశాల, మరో ప్రైవేట్ ట్యూషన్ వల్ల దాదాపు 50 మంది పిల్లలు కరోనా బారిన పడటంతో ప్రభుత్వం.. స్కూళ్లను తెరవడంలో పునరాలోచిస్తోంది.

ఈ నేపథ్యంలో నవంబర్ 5న అనుకున్న టైమ్ కి స్కూళ్లు తిరిగి ప్రారంభించినా, ప్రారంభించకపోయినా విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగ్ లు, బట్టలు, పుస్తకాలు ఇచ్చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

వృథాని అరికట్టేందుకు, పిల్లలకు అవి ఇప్పుడైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతోటే విద్యా కానుక పంపిణీకి తాజాగా ఈనెల 8న మహూర్తం పెట్టారు. ఈమేరకు సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 42.34 లక్షల మంది విద్యార్థులకు సుమారు 650కోట్ల రూపాయల ఖర్చుతో విద్యాకానుక కిట్స్ ఇస్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నవారిని కూడా ఇందులో చేర్చారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేస్తారు.

ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫామ్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్ లు, బెల్ట్, ఒక సెట్ క్లాస్ బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ ఉంటాయని తెలిపారు. వీటితోపాటు.. తాజాగా ఒక సెట్ మాస్క్ లను కూడా ఉచితంగా పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు.

స్టూడెంట్ కిట్స్ పంపిణీ వల్ల బడిమానేస్తున్న పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గడంతోపాటు.. తల్లిదండ్రుల్లో కార్పొరేట్ స్కూళ్లపై వ్యామోహం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్ కి వెళ్లేవారు కూడా యూనిఫామ్, షూ, టై, బ్యాగ్ తీసుకుని వెళ్తారు కాబట్టి ఎక్కడా పేద, ధనిక అనే తేడాలు కనపడవు. 

జడ్జిమెంట్స్ పై నాకు ఎంతైనా మాట్లాడే హక్కుంది