జగన్ ప్రభుత్వ విధానాలను తప్పు పట్టడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదలుకోవడం లేదు ఈనాడు పత్రిక! దారిన పోయే ఎల్లయ్యా, పుల్లయ్యను కూడా మేధావిగా పరిచయం చేస్తూ.. వారి చేత జగన్ ప్రభుత్వ విధానాలను తప్పు పట్టించే విశ్లేషణలను చేయిస్తూ, వాటిని వెబ్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఈనాడు తన వంతు సైంధవ పాత్రను పోషిస్తూ ఉంది.
మూడు రాజధానుల అంశం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం.. ఇవే ఈనాడుకు బాగా బాధాకరమైన అంశాలు. నిన్న మూడు రాజధానుల అంశం గురించి ఎవరికీ తెలియని పార్టీకి చెందిన ఒక ఎల్లయ్య తప్పు పడుతూ విశ్లేషణ చేయగా, ఇప్పుడు మరో పుల్లయ్యను పట్టుకుని వచ్చి.. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగులోనే విద్యాబోధన జరగాలి తప్ప, ఇంగ్లిష్ కూడదని చెప్పించారు!
ఆ ఎల్లయ్య పుల్లయ్యల విశ్లేషణల్లో హేతుబద్దత, సహేతుకత, సరైన సమాచారాలు కూడా ఉండవు! ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా ఆ దేశానికి మధ్యలో ఉంటుందనే తప్పుడు సమాచారాలను కూడా ఇస్తూ ఆ మేధావులు తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా వరకూ ఎందుకు? ఇండియా రాజధాని ఎక్కడ ఉంది? మహాభారత కాలం నుంచి భారతదేశ రాజధాని దేశానికి మధ్యన ఉంటోందా? లేక మరో మూలన ఉంటోందా? అనే అశం గురించి వీళ్లు మాట్లాడరు.
తాము వినిపించాలనుకున్న వెర్షన్ కు అనుగుణమైన దేశాలను ఉదాహారించడం, అది కూడా తప్పుడు సమాచారాలను ఇచ్చి విశ్లేషించడం వీరు చేసే పని! ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన గురించి తెగబాధపడిపోతున్న ఈ విశ్లేషకులు తమ పిల్లలను ఏ మాధ్యమంలో చదివించారు? వీరి మనవళ్లు- మనవరాళ్లు ఏ బాష మాధ్యమంలో చదువుతున్నారు? అంటే.. మాత్రం సమాధానం ఉండదు! .
అలాంటి ప్రశ్న అడగకూడదు, వారు చెప్పే సోధి వినాలి, వారు మాతృభాష అంటూ సెంటిమెంట్ ను రేకెత్తిస్తే జనాల రోమాలు నిక్కబోడుచుకోవాలి, వారి పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదవాలి, పేదల పిల్లలు మాత్రం తెలుగును ఉద్ధరించాలి! ఎంతమంది చేత చెప్పించినా తెలుగుదేశం దాని పార్ట్ నర్ జనసేన పచ్చ మీడియా.. తెలుగు జనాలకు ఇచ్చే సందేశం మాత్రం ఇదే!