రానురాను తెలుగులో బోల్డ్ కథలు, కొత్త కాన్సెప్టులు పుట్టుకొస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన చావు కబురు చల్లగా అనే ట్రయిలర్ లో భర్త చనిపోయి ఏడుస్తున్న భార్యకు సైట్ కొడతాడు హీరో. ఇప్పుడు అలాంటిదే మరో బోల్డ్ కథ రెడీ అయింది. ఈ సినిమా పేరు ఏక్ మినీ కథ.
ఈరోజు ఈ సినిమా టీజర్ రిలీజైంది. “అది చిన్నదైతే మాత్రం ప్రాబ్లమ్ పెద్దదే” అనే డైలాగ్ తో ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచారు. చెవిలో గుసగుసలాడుకోవడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే.. ఇది కూడా బోల్డ్ కంటెంట్ తోనే వస్తోందనే విషయం అర్థమౌతుంది.
గీతాఆర్ట్స్-2 టైపులో, ఈ సినిమా కోసం యూవీ కాన్సెప్ట్స్ అనే బ్యానర్ పెట్టారు యూవీ నిర్మాతలు. మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు కథ, రచనా సహకారం అందించాడు. కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.
3 భాషల్ని కలిపి పెట్టిన ఈ టైటిల్ తో పాటు టీజర్ కూడా ఆకట్టుకుంది. సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.