పరస్పరం ఇష్టపడిన వారి మధ్యన, శృంగార కాండ ఇద్దరికీ అలవాటు అయినప్పటికీ… ఎప్పటికప్పుడు సెక్సీ మూడ్ ను కలిగించే అంశాలు మాత్రం ప్రత్యేకం! సెక్స్ అనేది అలవాటుగా బోర్ కొట్టనీయనీయకుండా చేసే అంశాలు కూడా ఇవి! శృంగారాన్ని రొటీన్ కానీయకుండా చేసే శక్తి కూడా వీటికి ఉంది.
ఇంతకీ ఆ అంశాలు ఏమిటనే విషయంపై పలు అభిప్రాయాలను తీసుకోగా… ఎక్కువ మంది తమను సమ్మోహన పరిచే సెక్సీ ఫ్యాక్ట్స్ గా పేర్కొన్న అంశాలు ఇవి. వీటిని వారు తమ పార్ట్ నర్ ను శృంగారానికి సమాయత్తం చేయడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇంతకీ అవేమిటంటే!
శృంగార సంగీతం
తమ పార్ట్ నర్ లో సెక్సీ ఫీలింగ్స్ ను కలిగించడానికి సంగీతాన్ని ఉపయోగించుకుంటామని కొందరు చెబుతున్నారు. తాము అప్పటికే మూడ్ ఆన్ లో ఉంటే, తమ పార్ట్ నర్ లోనూ అలాంటి ఫీలింగ్ ను కలిగించడానికి సంగీతాన్ని ప్లే చేయడం అనే ఆప్షన్ ను ఉపయోగించుకుంటున్నారట వీళ్లు.
తమ ఇరువురికీ రొమాంటిక్ గా అనిపించే సంగీతాన్ని ప్లే చేయడం ద్వారా పార్ట్ నర్ ను శృంగార సమరానికి సమాయత్తం చేస్తామనేది కొందరు పంచుకుంటున్న సెక్సీ ఫ్యాక్ట్.
సరైన ప్లేస్
ప్రతి జంట జీవితంలోనూ శృంగారానికి సంబంధించి కొన్ని ఎవరిగ్రీన్ ప్లేస్ లు ఉండవచ్చు. తాము హనీమూన్ కు వెళ్లిన ప్లేస్ లు కావొచ్చు, లేక ఇంట్లోనే తమకు బాగా అనిపించే గది కావొచ్చు. అరుదుగా వెళ్లే ప్లేస్ కావొచ్చు.. వీటిల్లో కొన్ని సెక్సీగా అనిపిస్తూ, శృంగారేచ్ఛను మరింతగా పెంచవచ్చు.
డర్టీ టాక్!
మంచి సంగీతం, అనువైన ప్లేస్ మాత్రమే కాదు.. మాటలు కూడా శృంగారకాండలో చాలా కీలకమైన అస్త్రాలు. ఈ విషయంలో కొందరు మొహమాట పడొచ్చు, డిప్లొమాటిక్ గా ఉండొచ్చు. అయితే శృంగారం విషయంలో డిప్లొమాటిక్ గా ఉండటం కన్నా, అనువైన వారి వద్ద పచ్చిగా ఉండగలగడం కూడా కీ టెక్నిక్కే.
పురుషుడు తన మానాన తను శృంగారకాండను సాగించడాన్ని కేవలం అతడి ఎంజాయ్ మెంట్ గా మాత్రమే భావిస్తారట కొంతమంది స్త్రీలు. దీన్ని బట్టి శృంగారంలో కమ్యూనికేషన్ చాలా కీలకం. కమ్యూనికేషన్ తో కూడిన శృంగారాన్ని స్త్రీ ఆస్వాధించవచ్చు. మాటలతో ఆమెను రెచ్చగొట్టేందుకు డర్టీ టాక్ ను మోతాదు మేరకు, మూడ్ కు తగ్గట్టుగా వాడటం ఒక హాట్ ఫ్యాక్ట్!
బాడీలాంగ్వేజ్
సంగీతం, మాటలు, ప్లేస్.. ఇవన్నీ ఎలా ఉన్నా పార్ట్ నర్ బాడీలాంగ్వేజ్ ను గ్రహించడం కూడా కీలకమైన అంశం. స్త్రీ బాడీలాంగ్వేజ్ ను చదవడం ఒక కళ అని అంటారు. ఈ విషయంలో మగాడి ప్రతిభాపాటవాలు బయటపడటం మీదే వారి శృంగార జీవితం ఆధారపడి ఉంటుందంటారు.
వస్త్రధారణ..
శృంగార భావనలను కలిగించడంలో వస్త్రధారణది కూడా కీలకమైన స్థానమే. దాంపత్యంలో ఉన్న వారికి వారికి ప్రత్యేకంగా చెప్పవలసిన అంశం ఏమీ కాదు ఇది. సాహిత్యంలోనూ, కథల్లో కూడా సాయంత్రానికి అందంగా తయారు కావడం అనే కాన్సెప్ట్ గురించి కవులు, రచయితలు బోలెడన్ని వర్ణనలను అందించారు.