ఈ సర్వేలో తేలిపోతుంది ఏపీ అప్రమత్తత ఏంటో..!

ఇప్పటికే తెలంగాణలో కేసులు పెరిగిపోయాయని అనధికారిక సమాచారం. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ఉత్తరాది రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతోంది. ప్రభుత్వం సన్నద్ధత ఏంటనేది ఇప్పటికే బయటపడిపోయింది. హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్లే,…

ఇప్పటికే తెలంగాణలో కేసులు పెరిగిపోయాయని అనధికారిక సమాచారం. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ఉత్తరాది రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతోంది. ప్రభుత్వం సన్నద్ధత ఏంటనేది ఇప్పటికే బయటపడిపోయింది. హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్లే, ప్రయాణికుల తాకిడి వల్లే ఇదంతా అని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. పరిస్థితి చేయిదాటుతోందనే విషయంపై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. 

దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ కి సంబంధించి తెలంగాణలోనే తొలి కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఏపీ విషయానికొస్తే ఈ రోజు నుంచి ఏపీలో ఫీవర్ సర్వే మొదలవుతోంది. ఇప్పటికే 33సార్లు ఫీవర్ సర్వే చేపట్టారు. ఇది 34వసారి. దీంతో ఏపీలో కొవిడ్ తాజా పరిస్థితి ఏంటనేది ఈరోజు నుంచి తేలిపోతుంది.

ఇంటింటికి వెళ్లి ఆశా వర్కర్లు, వాలంటీర్లు ప్రజల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటారు. కొవిడ్ లక్షణాలుంటే వెంటనే శ్వాబ్ సేకరించి పరీక్షకు పంపిస్తారు. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చినవారితో సంబంధం ఉన్నా, వారితో ప్రైమరీ లేదా, సెకండరీ కాంటాక్ట్ లో ఉన్నా కూడా ఒమిక్రాన్ వేరియంట్ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కి పంపిస్తారు. ఇక ఈనెలలో ఇప్పటి వరకు విదేశాలనుంచి వచ్చిన 26వేల మందికి మరోసారి పరీక్షలు నిర్వహించేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు. ఈ ఫలితాలను విశ్లేషిస్తే, ఏపీలో కేసుల సంఖ్య ఎలా ఉంది, ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై క్లారిటీ వస్తుంది.

ఏపీలో ఇప్పటికే ఓ కేసు నమోదయినా, ఒమిక్రాన్ కన్ఫామ్ చేసే సమయానికి అసలు కొవిడ్ లేదని తేలిపోయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏ జిల్లాలో తొలి కేసు నమోదవుతుందా, ఏం చేయాలా అని తలలు పట్టుకున్నారు. ఇప్పుడు ఫీవర్ సర్వే మొదలు పెట్టబోతుండటంతో సహజంగానే కొవిడ్ కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. విదేశాలనుంచి వచ్చినవారిని కూడా పట్టి పట్టి చూస్తారు కాట్టి, ఒమిక్రాన్ జాడ కూడా బయటపడుతుంది. నిజంగానే ఏపీ మేడిపండులా ఉందా, లేక కేసులేవీ లేని ఆరోగ్య స్థాయిలో ఉందా అనే విషయం ఫీవర్ సర్వేతో తేలిపోతుంది.

ముందస్తు జాగ్రత్తల్లో జగన్ సర్కారు..

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి, తెలంగాణలో కూడా కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతానికి ఏపీలో కేసులు లేవు కాబట్టి లైట్ తీసుకుంటామంటే కుదరదు. ఏమరుపాటు లేకుండా ముందు జాగ్రత్తగా జగన్ ప్రభుత్వం ఫీవర్ సర్వే మొదలు పెట్టింది. 

వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు కాబట్టి.. ఏపీలో ఫీవర్ సర్వే చకచకా ముందుకు సాగుతుంది. కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ని సమర్థంగా ఎదుర్కున్నట్టే.. థర్డ్ వేవ్ ని కూడా ఎదుర్కునేందుకు ఏపీ సిద్ధమవుతోంది.