దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు 35 మంది మరణించినట్టు ప్రాధమిక సమాచారం. దట్టమైన పొగలు అలుముకోవడంతో వీళ్లలో ఎక్కువమంది ఊపిరి ఆడక చనిపోయారు.
రాణీ ఝాన్సీలోని అనాజ్ మండీ ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో ఈరోజు తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పొగలు కమ్ముకున్నాయి. దీంతో అందులో నివశిస్తున్నవారికి ఎటు వెళ్లాలో తెలియక ఊపిరి ఆడలేదు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు 50మందిని కాపాడారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లో ఎంతమంది ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ప్రస్తుతం 30 ఫైర్ ఇంజిన్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆ భవంతిలో 30 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది.