Advertisement

Advertisement


Home > Movies - Movie News

కమల్ పోస్టర్ మీద పేడ కొట్టిన లారెన్స్

కమల్ పోస్టర్ మీద పేడ కొట్టిన లారెన్స్

నిన్నట్నుంచి ఇదే హెడ్డింగ్ కోలీవుడ్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరికొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి కమల్ కు లారెన్స్ కు ఎక్కడో చెడిందంటూ కథలు కూడా అల్లేశారు. దీంతో కమల్ ఫ్యాన్స్ గట్టిగానే ట్రోలింగ్ షురూ చేశారు. లారెన్స్ పాత ఫొటోలు తీస్తూ కామెంట్స్ చేయడం, అతడి ఫొటోల్ని మార్ఫింగ్ చేయడం, లారెన్స్ ఫొటోలకు దండలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం లాంటి కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. ఇలాంటి విషయంలో తమిళ ఫ్యాన్స్ క్రియేటివిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకోండి. అది వేరే విషయం.

ఇలా తనపై ఓ రేంజ్ లో దబిడి దిబిడి స్టార్ట్ అవ్వడంతో వెంటనే రంగంలోకి దిగాడు లారెన్స్. దర్బార్ ఆడియో లాంచ్ లో తను మాట్లాడిన మాటల్ని వక్రీకరించారని చెప్పుకొచ్చిన లారెన్స్, ఆ మేరకు ఓ భారీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దయచేసి తను మాట్లాడిన వీడియో అంతా చూడాలని, 2-3 వాక్యాలు విని తనను తప్పుగా అర్థం చేసుకున్నారని సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

"కమల్ సర్ పోస్టర్ పై నేను ఆవు పేడ కొట్టానని చాలా పోస్టులు చూశాను. దయచేసి అంతా నా వీడియో మొత్తం చూడాలి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు, రజనీకాంత్ వీరాభిమానిగా తెలియకుండా చేసిన పని అది. చాలా సందర్భాల్లో కమల్-రజనీ చేతులు పట్టుకొని నడవడం చూసి చాలా హ్యాపీ ఫీలయ్యాను. కమల్ సర్ అంటే నాకు చాలా గౌరవం ఉంది."

ఇలా తను మాట్లాడిన మాటలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు లారెన్స్. తన వల్ల ఏదైనా తప్పు జరిగిందని తెలిసినప్పుడు వెంటనే దాన్ని సరిదిద్దుకుంటానని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు కూడా చెబుతానని,.. కానీ ఈ విషయంలో తను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు లారెన్స్. కమల్ పై తనకున్న అభిమానాన్ని కొత్తగా నిరూపించుకోవాల్సి అవసరం అంతకంటే లేదంటూ ముగించాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?