ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందులోనూ మతాంతర వివాహం. దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకంగా ఒక పాప కలిగింది. ఉన్నట్టుంది భర్త వైఖరిలో మార్పు. అతని మనసులో మరో మహిళ ప్రవేశించింది. దీంతో దంపతుల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. చివరికి భర్త వివాహేతర సంబంధం డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ అయిన భార్య ఉసురు తీసింది. వివరాల్లోకి వెళితే…
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వహీదాబేగం (32), భానుప్రకాశ్ మతాలు వేర్వేరు అయినప్పటికీ…మనసులు కలిశాయి. వహీదాబేగం ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్. మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్‌లో పనిచేసేది. ఆమె భర్త భానుప్రకాశ్ మహ బూబ్‌నగర్ అటవీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ ఒకే డిపార్ట్‌మెంట్ కావడం గమనార్హం.
కొంతకాలంగా వాళ్లద్దరి మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అవి ఇద్దరి మధ్య గొడవలకు దారి తీశాయి. తరచూ పోట్లాడు కునేవారు. మరో మహిళతో భానుప్రకాశ్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వహీదాబేగం భరించలేకపోయింది. పోలీస్‌స్టేష న్‌లో పంచాయితీ పెట్టించింది. అనేక సార్లు పోలీసులు వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్చ్…వాళ్ల మధ్య సర్దుబాటు కాలేదు. దీంతో ఆమె జీవితంపై విరక్తి చెందింది.
యధావిధిగా బుధవారం ఆమె డ్యూటీకి వెళ్లింది. తన కార్యాలయ పక్కగదికి వెళ్లి పురుగుల మందు తాగింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చింది. సహచర అధికారులు, ఉద్యోగుల ఎదుట కూచున్నారు. పురుగుల మందు ప్రభావం చూపడంతో కడుపు నొప్పి మొదలైంది. ఆ నొప్పిని భరించలేక తాను విషం తాగిన విషయాన్ని తోటి ఉద్యోగులకు చెప్పి కూలబడింది. ఆందో ళనకు గురైన ఉద్యోగులు వెంటనే ఆమెను రక్షించుకునేందుకు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయమై పోలీసులతో పాటు వహీదా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. భానుప్రకాశ్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో తరచూ భార్యాభర్తలు గొడవ పడేవారని వహీదా తల్లి ముబారక్ బేగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్లుడి వివాహేతర సంబంధమే తన కూతురి ఆత్మహత్యకు కారణమని ఆమె పేర్కొంది. మహబూబ్‌నగర్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని తరచూ తన కూతురితో భానుప్రకాశ్ చెప్పేవాడని, అందువల్లే వహీదా జీవితంపై విరక్తి చెందిందని ఫిర్యాదులో తల్లి పేర్కొన్నారు. మృతురాలి భర్త భానుప్రకాశ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.