రాష్ట్రంలోనే రెండవ అతి పెద్ద నాన్ మేజర్ పోర్ట్ గంగవరం పూర్తిగా అదాని పరం అయింది. కేవలం పది శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా తప్ప మిగిలిన తొంబై శాతం వాటాలూ అదానీ చేతిలోనే ఉన్నాయి.
గంగవరం పోర్టు మూలధనం 51.70 కోట్ల షెర్లు అయితే ఇందులో 10.4 శాతం రాష్ట్ర ప్రభువానిది, వార్ బర్గ్ పింకస్ చేతిలో ఉన్న 31.5 శాతం వాటాలను కూడా అదానీ గ్రూప్ 1,954 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. తాజాగా డీవీఎస్ రాజు ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటాను కూడా అదానీ 3,604 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుంది.
దీంతో గంగవరం ఇక అదాని చేతుల్లోకి వచ్చినట్లు అయింది. ఇక గంగవరం పోర్టుకు దేశంలోని ఎనిమిది రాష్ట్రాల నుంచి సరకు రవాణా అవుతుంది. దాదాపుగా 1800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతి లోతు అయిన ఈ పోర్టు ఏ సీజన్ లో అయినా సరకు రవాణా కార్యకలాపాలు నిర్వహించగలిగే సామర్ద్యం కలది.
మరోవైపు క్రిష్ణపట్నం పోర్టు కూడా అదాని గ్రూప్ చేతుల్లోనే ఉంది. దీంతో పాటు గంగవరం కూడా దక్కుతున్న నేపధ్యంలో దేశంలోని తూర్పు తీరం పోర్టు కార్యకలాపాలు అన్నీ కూడా అదాని గ్రూప్ చేతుల్లోకే వెళ్తున్నాయని చెప్పాలి.