రంగ్ దే సినిమాకు సంబంధించి యూనిట్ ఓ రేంజ్ లో ప్రమోషన్ చేస్తోంది. సాధారణంగా హీరోహీరోయిన్లతో చేసే ప్రమోషన్లకు భిన్నంగా నటీనటులందర్నీ రంగంలోకి దించేసింది.
నితిన్, వెన్నెల కిషోర్, నరేష్, అభినవ్, బ్రహ్మాజీ, నిర్మాత నాగవంశీ.. ఇలా బెటాలియన్ మొత్తం రంగంలోకి దిగిపోయింది. షూటింగ్ టైమ్ లో తమ అనుభవాల్ని, ఫేస్ చేసిన ఫన్నీ సంఘటనల్ని చెప్పుకొస్తున్నారు.
ఈ క్రమంలో తనకు ఎదురైన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను బయటపెట్టాడు సీనియర్ నటుడు నరేష్. అందరికీ అమాయకంగా కనిపించే కీర్తిసురేష్ లో ఓ అల్లరి పిల్ల ఉందని, ఆ అల్లరిని భరించడం చాలా కష్టం అంటున్నాడు నరేష్. కీర్తిసురేష్ ఏం చేసిందో ఆయన మాటల్లోనే..
“కరోనా తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాం. అందర్లో భయం. ఏసీ సెట్ లో చాలామంది క్రూతో పనిచేయాల్సి వచ్చింది. మాస్కులు మస్ట్. అలాంటి టైమ్ లో మాస్క్ లేకుండా వచ్చింది కీర్తిసురేష్. నేరుగా వచ్చి నా ముఖంపై దగ్గింది. చాలా డేంజర్ పిల్ల. నాకేమో 50ఏళ్లు దాటాయి. కరోనా వస్తుందేమో అని చాలా భయం వేసేది.”
ఇలా కీర్తిసురేష్ చేసిన చిలిపి పనుల్ని గుర్తుచేసుకున్నాడు నరేష్. ఇదే విషయాన్ని నితిన్ కూడా అంగీకరించాడు. కీర్తిసురేష్ చాలా సరదాగా ఉంటుందని, సెట్స్ పైకి వచ్చిన వారం రోజుల్లోనే బాగా కలిసిపోయామని అన్నాడు.