తడవకో నియోజకవర్గం మారడం… పోటీ చేసిన చోటు మళ్లీ చేయకపోవడం… ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధేమీ ఉండదు… వెనక్కి తిరిగి చూసుకుంటే అవినీతి అక్రమాలు కబ్జాలు దొమ్మీలు దోపిడీలు తప్ప ఏమీ కనిపించవు. ఆయన తిరగని పార్టీ అంటూ లేదు … ఆయన్ని భరించలేమంటూ చివరకు బీజేపీ, జనసేన కూడా తలుపులు మూసేశాయి.
2018 అక్టోబర్ లో విశాఖలోని తిమ్మాపురం జంక్షన్ దగ్గర దివంగత వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నించగా… దాన్ని అడ్డుకోవడమే కాదు , వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టుచేయించాడు అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు. తన పీఏలు, ఓఎస్డీలతోనూ అవినీతి చేయించి… బినామీలుగా మార్చుకోవడంతో… వారిపై తాను మంత్రిగా ఉన్నప్పుడే ఏసీబీ దాడులు జరిగాయి. అధికారానికి, డబ్బుకు తప్ప ఏ పార్టీకి, ఏ నాయకునికీ విధేయునిగా ఉండని తత్వం గంటాది అంటారు ఆయన తీరును పరిశీలిస్తున్న వారు!
-గంటా శ్రీనివాసరావు మాజీ పీఏ క్రాంతి కిరణ్ పై ఏసీబీ 2016 నవంబర్ 6న దాడులు చేసి ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించింది. మార్కెట్ వేల్యూ 15 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించి కేసు పెట్టింది.
– డీఈఓ పోస్టుల నియామకంలో అవినీతి అక్రమాల వల్ల… అప్పటి పర్సనల్ సెక్రటరీలు ఎంఆర్జీ నాయుడు, బాల స్వామిపై ఆరోపణలు వెల్లువెత్తి… మాజీ సీఎం చంద్రబాబు ఎంక్వయిరీ కమిటీలు వేయాల్సివచ్చింది.
– డాల్ఫిన్ నోస్ హిల్స్, రెడ్ శాండ్ డ్యూన్స్ కూడా గంటా శ్రీనివాస్ అండ్ కో కబ్జా చేసిందని… అలాంటి వ్యక్తికి జనసేనలో చోటు లేదని పవన్ కల్యాణే చెప్పేశాడంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
– అవినీతి, అక్రమాలకు తప్ప ఏ పార్టీకి విధేయుడు కాని వ్యక్తి గంటా శ్రీనివాసరావు. ఈ విషయాన్ని ఆయన రాజకీయ చరిత్రే చెబుతోంది.
– విశాఖపట్నంలోని ద్వారకానగర్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరావు కాంప్లెక్స్ ను జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. అదే గంటా విషయానికి వస్తే..భీమిలిలో లీజుకు తీసుకున్న భూమిలో అక్రమంగా నిర్మించిన గంటా గెస్ట్ హౌస్ ను కూల్చేసేందుకు నోటీసులిస్తే… హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న వ్యక్తీయన.
– 2009 ఎన్నికల్లో ఓటర్లకు లంచాలిచ్చాడన్న కేసులో అనకాపల్లి పోలీసులు కేసుపెట్టారు. గంటాకు అనకాపల్లి సెకండ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చింది. ఐపీసీ 171(E) కింద పోలీసులు కేసు మోదు చేశారు.
– 2009లో గంటా శ్రీనివాసరావుపై అనకాపల్లిలోనే హత్యాయత్నం కేసు నమోదయ్యింది. Cr.No.15/2009 కేసు అది. సెక్షన్ 307, 332 ఐపీసీ కింద తీవ్రంగా గాయపరచడం, హత్యాయత్నం కేసులు నమోదయ్యింది. అయితే దాని తర్వాత టీడీపీ ప్రభుత్వం కేసును ఎత్తివేస్తూ జీఓ తెచ్చింది. అచ్చెన్నాయుడిపై ఉన్న లైంగిక వేధింపుల కేసు సహా 23 మంది టీడీపీ నాయకులపై కేసులు ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిస్సిగ్గుగా జీఓ తెచ్చింది.
– శాండ్, మైనింగ్ లాబీలకు మేలు చేయడం… వారి నుంచి కమీషన్లు దండుకోవడం గంటాకు హాబీ. అందుకే ఆయన అధికార పార్టీవైపే ఎప్పుడూ చూస్తుంటాడు. తమవాడు అధికార పార్టీలో ఉంటే ఆ లాబీలకు ఒక రకమైన ధైర్యం. అలాంటి గంటా… అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారిపై నానా వాగుడూ వాగాడు. దాన్ని వైసీపీ కార్యకర్తలు తట్టుకోలేక… నిరసనలకు దిగారు.
– గంటా అండ్ గ్యాంగ్ ను చూసే… గత ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రాలేదు. నిజాయతీగా వ్యాపారం చేయాలనుకునేవారు… కంపెనీలు నడపాలనుకునేవారికి ఈ గంటా స్పెషల్ ట్యాక్స్ ఒక పెద్ద అడ్డంకిగా ఉండేది.
ఈ రాజకీయ బేహారిపై ఎంత చెప్పినా తక్కువే. రాజకీయాలను ఏనాడూ ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించని నాయకుడు విశాఖ జిల్లాలో ఎవరైనా ఉన్నారా అంటే… అది గంటా శ్రీనివాసరావేనని చెప్పుకుంటారు విశాఖ పౌరులు.