ముఖ్యమంత్రిగా జగన్ సంచలన నిర్ణయాలే వరసగా తీసుకుంటున్నారు. ఆయనకు ముందు ఉన్న వారు ఎవరూ కలలో కూడా తలవని ఆలోచనలను జగన్ ఆచరణలోకి తెచ్చి చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో ఎస్టీ ఎస్సీ కమిషన్ ని ఇపుడు రెండుగా చేసి గిరిజనులకు జగన్ సమ న్యాయం చేశారని అంటున్నారు. అలా ఏర్పడిన ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్ గా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంభా రవికుమార్ ని ఎంపిక చేశారు. ఆయన ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఏపీలో మొత్తం ఉన్న 32 లక్షల గిరిజనులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా జగన్ మహోపకారం చేశారని రవిబాబు కొనియాడారు. వారి అభివృద్ధి కోసం ఈ ఉన్నత పదవిలో తాను శాయశక్తులా కృషి చేస్తానని కూడా రవిబాబు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు తూర్పుగోదావరి ప్రాంతంలో కొన్ని ఏరియాలో ఉన్న గిరిజన మొత్తం అభ్యున్నతి కోసం వైసీపీ సర్కార్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇపుడు కమిషన్ ఏర్పాటు వారి అస్థిత్వానికి మచ్చు తునక అంటున్నారు.