Advertisement

Advertisement


Home > Politics - Gossip

150 కోట్ల నగదు అందుకున్నదెవరో?

150 కోట్ల నగదు అందుకున్నదెవరో?

సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరక్ట్ టాక్సెస్ సంస్థ ఉన్నట్లుండి ఓ బాంబు పేల్చింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల హవాలా రాకెట్ కు సంబంధించి ఓ చైన్ ను బ్రేక్ చేసినట్లు, ఇందులో భాగంగానే దేశంలోని 42 ప్రధాన నగరాల్లో వివిధ ఇన్ ఫ్రా సంస్థలకు సంబంధించి సోదాలు చేసినట్లు తెలిపింది. అంతవరకు బాగానే వుంది. కానీ ఈ ప్రకటనకు కొనసాగింపుగా చేసిన మరో కొసరు ప్రకటన మాత్రం సంచలనంగా వుంది.

ఆంధ్రలోని ఓ ముఖ్య వ్యక్తికి 150 కోట్ల నగదు అందిందని తమ శోధనలో తేలిందని సెంట్రల్ బోర్డు తెలిపింది. కంపెనీల పేర్లు లేవు. కేవలం ఊళ్లపేర్లు మాత్రమే వున్నాయి. అలాగే ఎవరా కీలక వ్యక్తి అన్న పేరులేదు. కేవలం ఆంధ్ర ప్రదేశ్ అన్నది మాత్రమే తెలిపారు.

ఇన్ ఫ్రా కంపెనీలపై, రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఇటీవల చైన్ సిస్టమ్ కింద ఆదాయపన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని తెలుస్తూనే వుంది. 

సినిమా ప్రముఖులకు చెందిన రెండు సంస్థలపై ఇటీవల హైదరాబాద్, విజయవాడల్లో దాడులు జరిగితే, అంతా సినిమాల వ్యవహారం అనుకున్నారు. ఒక్కోదాడి చేస్తూ వస్తూ వుంటే అక్కడ దొరికిన లింక్ ల కారణంగా ఇలా ఒక్కో సంస్థను చెక్ చేసుకుంటూ వస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. 

మొత్తానికి ఇప్పుడు వచ్చిన ప్రకటన ఈ వార్తలను ధృవపర్చింది. అయితే ఈ 150 కోట్ల నగదు అందుకున్న ప్రముఖుడు ఎవరు అన్నదే ఇప్పుడు సస్సెన్స్ గా మారింది. ప్రముఖుడు అన్నారు కానీ వ్యాపారవేత్త, లేదా రాజకీయ వేత్త అనలేదు. అందుకే ఎవరు అన్నదానిపై ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. 

ఇవ్వాళో రేపో పన్నుల బోర్డు ఏమాత్రం మరిన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లినా, ఆ ప్రముఖుడు ఎవరో తెలియడానికి కాస్త ఆస్కారం వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?