Advertisement

Advertisement


Home > Politics - Gossip

6 లో 3 :: నెల్లూరుకిస్తారా జగన్!

6 లో 3 :: నెల్లూరుకిస్తారా జగన్!

రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు నగారా మోగినట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నాలుగింటినీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోబోతున్నది. అయితే నాలుగింటిలో రెండు స్థానాలకు అభ్యర్థులెవరో ఖరారుకాగా.. మిగిలిన రెండు సీట్లు ఎవరికనేదే సస్పెన్స్ గా ఉంది.. చాలా కాంబినేషన్లను పరిశీలిస్తున్నప్పుడు.. ఒక సీటు నెల్లూరు జిల్లా వారికి దక్కుతుందనే ప్రచారం మెండుగా ఉంది. అదే నిజమైతే గనుక.. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉండబోయే ప్రాతినిధ్యం 6 సీట్లలో ముగ్గురు ఎంపీలు నెల్లూరు జిల్లా వాళ్లే అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రాంతాల సమతూకం పరంగా కరక్టేనా? అనే అభిప్రాయం వినవస్తోంది.

జగన్మోహన రెడ్డి రాజ్యసభ ఎంపీలుగా ఎవరిని పంపాలనే విషయంలో కొంతవరకు చాలా క్లారిటీతోనే ఉన్నారు. రాంకీ గ్రూపు సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి, టీటీడీఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్లు ఇప్పటికే ఖరారైనట్టే లెక్క. అయితే ఇంకా రెండు స్థానాలకు ఎవరనేదే లెక్కతేలడం లేదు.

జగన్ , శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ నిర్ణయం అమల్లోకి వచ్చినప్పుడు.. ఆయన కేబినెట్లో రెండు బెర్తులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మండలినుంచి కేబినెట్ లో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ల ఎమ్మెల్సీ పదవి పోతుంది. కాబట్టి వీరిని రాజ్యసభ ఎంపీలుగా పంపే యోచన చేస్తున్నట్లు ఒక ప్రచారం ఉంది.

అయితే వీరిలో ఒకరిని మాత్రం రాజ్యసభకు పంపి, మరొకరికి పార్టీ పదవి ఇస్తారనే ప్రచారం ఉంది. అలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డికి సన్నిహితుడు, ఇటీవల పార్టీలో చేరిన బీద మస్తాన్ రావును ఎంపీ టికెట్ వరించవచ్చునని సమాచారం. అదే జరిగితే గనుక.. నెల్లూరు జిల్లానుంచి వైకాపా తరఫున ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లవుతుంది. ఆ పార్టీకి రాజ్యసభలో ఉండే బలం 6గురిలో, యాభైశాతం  ఒకే జిల్లాకు ఇచ్చినట్లు అవుతుంది.

నెల్లూరు జిల్లానుంచి ఇప్పటికే విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఎంపీలుగా ఉన్నారు. బీద మస్తాన్ రావుకు ఇస్తే మూడో ఎంపీ అవుతారు. అలాగే.. మేకపాటి రాజమోజహన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన బీద కు బదులుగా, సుదీర్ఘకాలంగా, తొలినుంచి పార్టీకి సేవలందిస్తున్న మేకపాటికి అవకాశం ఇచ్చినా కూడా నెల్లూరు జిల్లాకు మూడు సీట్లు ఇచ్చినట్లు అవుతుంది. పైగా దక్కే నాలుగు సీట్లలో మూడు రెడ్డి వర్గానికే కట్టబెట్టినట్టు కూడా అవుతుంది. మరి ఈ సంక్లిష్టతను జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?