Advertisement

Advertisement


Home > Politics - Gossip

గెలిస్తే 'దేశం' గొప్ప...ఓడితే వైకాపా రౌడీయిజం

గెలిస్తే 'దేశం' గొప్ప...ఓడితే వైకాపా రౌడీయిజం

హమ్మయ్య..చాన్నాళ్ల తరువాత అచ్చెం నాయుడు పేరు మీడియాలో వినిపించింది. ఇటీవల కాలంలో ఆయన ఎక్కడున్నారో..ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. స్థానిక ఉపఎన్నికల పలితాల నేపథ్యంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన ఓ స్టేట్ మెంట్ పడేసారు.

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు దిగాలంటూ సవాలు విసిరారు. మెడమీద తలకాయ వున్నవాడు ఎవరైనా రెండేళ్ల పదవీ కాలం పెట్టుకుని రాజీనామా చేస్తారా? ఇలాంటి సవాళ్లకు ఎప్పుడు అయినా చంద్రబాబు స్పందించి రాజీనామా చేసి ఎన్నికలకు దిగారా? అంతెందుకు అసలు చంద్రబాబు హయాంలో స్థానిక ఎన్నికలు జరిపడానికి దైర్యం చేసిన సందర్భాలు ఏవీ? 

ధైర్యంగా స్థానిక ఎన్నికలకు వెళ్లింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఏనాడూ తేదేపా కాదు. అలాంటిది ఇప్పుడు ఇలా సవాలు విసరడం. దీన్నే అంటారు. ఉట్టికి ఎగరలేదు కానీ స్వర్గానికి ఎగురుతుందని. ఓ పక్క అక్రమాలు చేసి కుప్పంలో గెలిచారు అంటారు. కానీ తేదేపా గెలిచిన చోట్ల ప్రజాబలం పెరిగింది అంటారు. ఇదెక్కడి లాజిక్ అన్నది ఆయనే చెప్పాలి. 

ఇలా ఆత్మవంచన చేసుకున్నన్నాళ్లు పార్టీ బలోపేతం కాదు. పార్టీ యంగ్ కేడర్ అంతా వైకపా, జనసేన పార్టీల్లోకి చేరిపోయిన సంగతి దేశం గుర్తించాలి. అధికారంలో వున్నన్నాళ్లు జుర్రుకున్న నాయకుల కేడర్ అంతా ఇప్పుడు సైలంట్ అయిపోయింది. ఎవ్వరూ పని చేయడం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది గెలుపు. 

అచ్చెన్నాయుడు కావచ్చు, బాబు, చినబాబు కావచ్చు ఇవి గమనించి, పార్టీని రిపేర్ చేసుకోనంతకాలం వ్యవహారం ఇలాగే నడుస్తుంది. గెలుపు వారిది, అరుపులు వీరివి అన్నట్లుగా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?