cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఎయిర్ పోర్ట్ ల్లో రాపిడ్ టెస్ట్ లు?

ఎయిర్ పోర్ట్ ల్లో రాపిడ్ టెస్ట్ లు?

లాక్ డౌన్ అనంతరం మే నెలలో మళ్లీ డొమస్టిక్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే విమానాశ్రయాల్లో ముందుగా థర్మల్ టెంపరేచర్ టెస్ట్ లు చేయడంతో పాటు కొత్తగా వచ్చిన రాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను వాడడం వంటి  చర్యలు తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. అంటే, ఎయిర్ పోర్ట్ కు వచ్చిన వారు ఇటు థెర్మల్ టెంపరేచర్ టెస్ట్, అవసరం అయితే రాపిడ్ టెస్టింగ్ ను పాస్ అయితేనే విమానం ఎక్కే చాన్స్ వుంటుంది.

టికెట్ రేట్లలో చేర్చడం కానీ లేదా, ప్రభుత్వాల ద్వారా సమకూర్చుకోవడం ద్వారా కానీ, వీలయినంత వరకు ప్రతి ఒక్కరికీ రాపిడ్ టెస్ట్ చేసే అవకాశాలు కూడా పరిశీలనలో వున్నాయని వినిపిస్తోంది. ఒకసారి చేసిన తరువాత నిర్ణీతం కాలం వరకు మళ్లీ అవసరం లేకుండా ఓ ఆన్ లైన్ సర్టిఫికెట్ లాంటిది ఇచ్చి, రెగ్యులర్ ట్రావలెర్స్ కు వెసులు బాటు ఇస్తారని బోగట్టా.

మొత్తం మీద విమానం ప్రయాణాలు అన్నవి మే నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే టికెట్ ల బుకింగ్ లు ప్రారంభమైంది. విమానయాన రంగం చాలా కష్టాల్లో వుంది. అందువల్ల కేంద్రం ఇంక ఎన్నాళ్లో విమానాలను ఆపే పరిస్థితి వుండకపోవచ్చు. కానీ అలా అని ఊరికే వదిలేసే వ్యవహారమూ వుండకపోవచ్చు  ప్రయాణీకుడికి ప్రయాణీకుడికి మధ్య సీటు ఖాలీగా వుంచడం, అదే విధంగా ఎయిర్ పోర్టుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి వాటిపై ఇప్పటికే రిహార్సల్స్ జరుగుతున్నట్లు బోగట్టా.

లోకమణి అమ్మకి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు