పాపం నిమ్మగడ్డ.. ఎవరికి చెప్పుకోవాలి!

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇప్పుడు ఒక కారణానికి సంతోషించాలి.. మరో కారణానికి బాధపడాలి. అయితే.. ఆయన తన బాధను ఎవరికి చెప్పుకోగలరు? నిమ్మగడ్డ వైఖరి మీద జగన్మోహన రెడ్డికి బాధ కలిగినప్పుడు.. ఆయన ఎంచక్కా…

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇప్పుడు ఒక కారణానికి సంతోషించాలి.. మరో కారణానికి బాధపడాలి. అయితే.. ఆయన తన బాధను ఎవరికి చెప్పుకోగలరు? నిమ్మగడ్డ వైఖరి మీద జగన్మోహన రెడ్డికి బాధ కలిగినప్పుడు.. ఆయన ఎంచక్కా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వచ్చిన తీర్పు తన ప్రభుత్వానికి అనుకూలం అనే ఆయన అనుకుంటున్నారు. అయితే ఎన్నికలను వాయిదా వేసిన తన నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టిపారేయలేదు గనుక…  అంతవరకు నిమ్మగడ్డ కూడా హేపీనే! కానీ… ఆయన అంతకంత దుఃఖించే పరిస్థితి కూడా మరొకటి ఉన్నది!

నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయం గనుక.. రాష్ట్రంలోని పరిపాలన వ్యవహారాలు అన్నింటికీ తానే సర్వాధికారిని అనే ఉద్దేశంతో… నిర్ణయాలు తీసేసుకున్నారు. కొందరు డీఎస్పీలను, కలెక్టర్లను ఆయన పక్కన పెట్టారు. ఒక పోలీసు అధికారిని ఏకంగా సస్పెండ్ చేసేశారు. అయితే ఈ నిర్ణయాలన్నీ తన ఆదేశాలు అని ఆయన అనుకున్నారు. అవన్నీ ఆదేశాలు కాదని, సూచనలు మాత్రమేనని ఆయనకు నెమ్మదిగా బోధపడుతున్నట్లుంది. ఎందుకంటే ఎంతగా ఎన్నికల సమయంలో తనకు సర్వాధికారాలు ఉన్నప్పటికీ.. అధికార్లను పక్కన పెట్టే ఉత్తర్వులు ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిందే. తన సర్వాధికారాలతో ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను జగన్ సర్కారు బుట్టదాఖలు చేసింది. ఏమాత్రం పట్టించుకోలేదు.

తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరో బాంబు పేల్చారు. ఆయన ఆదేశాలను పాటించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేనేలేదని ఆయన తేల్చేశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను నిబద్ధత లేని అధికారిగా ఆయన అభివర్ణించారు. తన ఆదేశాలు బుట్టదాఖలైన విషయం నిమ్మగడ్డకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయితే ఆయన ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలి? అదే అంత క్లారిటీ రావడం లేదు.

మహా అయితే.. నామినేషన్ల పర్వంలో జరిగిన అక్రమాలను పురస్కరించుకుని అధికార్లపై చర్య తీసుకుంటే.. ప్రభుత్వం ఆ ఆదేశాలను వినిపించుకోలేదని.. జోక్యం చేసుకోవాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పుకోగలరు. లేదా, సుప్రీం కోర్టుకు వెళ్లాలేమో. కానీ.. ఇప్పటికే ఎన్నికల వాయిదా నిర్ణయం పుణ్యమాని.. చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నారనే అపకీర్తి మూటగట్టుకున్న నిమ్మగడ్డ.. ప్రభుత్వంపై తానుగా ఫిర్యాదు చేస్తే.. ఆ అపకీర్తి మరింత పక్కా అవుతుంది కదా అనేది కూడా పలువురి సందేహంగా ఉంది.

రాష్ట్రానికి 5 వేల కోట్లు రాకుండా కుట్ర చేసిన చంద్రబాబు

లేడీ పోలీస్ బాబీ రాణి వార్నింగ్