Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఈ రభస సృష్టి.. ఒక ముందస్తు వ్యూహం!

ఈ రభస సృష్టి.. ఒక ముందస్తు వ్యూహం!

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వద్ద చంద్రబాబు రాక అనేది ఇవాళ చాలా పెద్ద రాద్ధాంతం అయింది. పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా అడ్డుకున్నారంటూ.. తెదేపా నాయకులు చాలా యాగీ చేశారు. అయితే.. వారు ఇచ్చిన అనుమతులను యథేచ్ఛగా ఉల్లంఘించినందుకే పోలీసులు అడ్డుకున్నారు తప్ప.. మరొకటి కాదనే వాస్తవాన్ని... ఈ రభస పుణ్యమాని వారు మరుగున పెడుతున్నారు. చంద్రబాబు ఎయిర్ పోర్ట్ నుంచి రామాపురం గ్రామానికి వెళ్లడానికి అనుమతి తీసుకుని... అందులో పోలీసులు ముందుగానే విధించిన షరతులన్నింటినీ ఉల్లంఘించడమే కాకుండా.. ఆ ఉల్లంఘనను అడ్డుకున్నందుకు.. ఎదురుదాడికి దిగడం అనేది చంద్రకోటరీకి మాత్రమే చెల్లిన విద్యలాగా కనిపిస్తోంది.

శాంతిభద్రతల దృష్ట్యా కాన్వాయ్ లో ఎక్కువ వాహనాలు ఉండకూడదని, ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ లు తప్ప మరే ఇతర నాయకులు చంద్రబాబు కాన్వాయ్ లో ఉండకూడదని పోలీసులు ఇచ్చిన అనుమతిలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు కాన్వాయ్  వెళ్లడానికి మాత్రమే ఈ అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా లౌడ్ స్పీకర్లు, మైకులు వాడడం తగదని నిబంధన విధించారు. షామియానాలు వేయకూడదని కూడా హెచ్చరించారు.

ఇలాంటి సాధారణ నిబంధనలతో పాటూ పెద్దసంఖ్యలో వాహనాల శ్రేణిని అనుమతించమని, ప్రదర్శన ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని ప్రత్యేకంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిలో ఏ నిబంధనను ఉల్లంఘించినా.. ముందస్తు నోటీసు లేకుండానే.. అనుమతి రద్దవుతుందని కూడా స్పష్టీకరించారు.

అయితే... ఈ ఉత్తర్వల్ని ఉల్లంఘించి రభస సృష్టించడమే తెదేపా లక్ష్యంగా ఎంచుకుంది. ప్రదర్శన చేసి తీరుతామని, పోలీసులు ఏం చేస్తారో చూస్తామని తెదేపా నాయకులు చంద్రబాబు విశాఖ చేరుకోవడానికి ముందే  హెచ్చరించారు. ఆయన వచ్చే సమయానికి పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలను అక్కడకు తరలించి, మోహరింపజేశారు. అసలు జనసమీకరణకే అనుమతి లేకపోగా.. పెద్దస్థాయి ప్రదర్శన నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకన్నారు. దీంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. చంద్రబాబుకు ఎంతగా నచ్చజెప్పినా వినకుండా మొండిపట్టు పట్టడం  జరిగింది. పోలీసులను ఎలా ఇరికించాలా అనేదే లక్ష్యం అన్నట్లుగా చంద్రబాబు వారితో వ్యవహరించారు. చివరికి ఆయన అడిగినట్లు లేఖ ఇచ్చి పోలీసులు అరెస్టు చేశారు.

లేఖ పుచ్చుకున్నంత మాత్రాన చంద్రబాబు సాధించేదేమీ లేదని.. తెదేపా పార్టీకిచ్చిన అనుమతి ఉత్తర్వుల ప్రకారం.. కేవలం నిబంధనల్ని ఉల్లంఘించినందునే ఆయనను అనుమతించలేదని ప్రజలకు అర్థమవుతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?