బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైకి ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూశారు. ఆ అంచనాలకు తగ్గట్టే.. 3 రోజుల నుంచి బాగా హైప్ ఇచ్చి మరీ సన్ నెక్ట్స్ యాప్ లో ఆ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ షాకింగ్ ఏంటంటే.. సన్ నెక్ట్స్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా ప్రత్యక్షమైంది.,
సినిమా విడుదలకు ముందు అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ పై చాలా హంగామా నడిచింది. కొంతమంది సన్ నెట్ వర్క్ దగ్గర డిజిటల్ రైట్స్ ఉన్నాయని రాస్తే, మరికొంతమంది నెట్ ఫ్లిక్స్ వద్ద ఉన్నాయంటూ రాశారు. అప్పట్లోనే అనుమానాలు ఉన్నాయి చాలామందికి. అయితే సన్ నెక్ట్స్ కే రైట్స్ ఇచ్చామంటూ తమ పీఆర్ టీమ్ తో చెప్పించుకున్నారు మేకర్స్.
కట్ చేస్తే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో కూడా సినిమా ప్రత్యక్షమైంది. డీల్ ఎలా లాక్ చేశారన్నది మేకర్స్ కే తెలియాలి. అయితే సమస్య ఇది కాదు. తమ సినిమా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో రాదంటూ ఓవర్సీస్ లో ప్రచారం చేసుకున్నారు మేకర్స్. తద్వారా ఎక్కువమంది ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ప్రేక్షకుల్ని సినిమా యూనిట్ తప్పుదారి పట్టించిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.
ఓవర్సీస్ బయ్యర్లు చెబుతున్నదేంటంటే.. సన్ నెక్ట్స్ యాప్ అనేది యూఎస్ లో రాదు కాబట్టి.. అల వైకుంఠపురములో సినిమా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో రాదంటూ తాము ప్రచారం చేసుకున్నామని అంటున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ కు కూడా రైట్స్ ఇచ్చారనే విషయం తమకు తెలియదంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తమ్మీద బన్నీ నటించిన ఈ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు ఒకేసారి రెండు డిజిటల్ వేదికలపైకి వచ్చేసింది. దీంతో మరింత మందికి ఈ సినిమా చూసే ఛాన్స్ దక్కింది.