Advertisement

Advertisement


Home > Politics - Gossip

అంబులెన్స్ లు ఆపడం తప్పేగా?

అంబులెన్స్ లు ఆపడం తప్పేగా?

అంబులెన్స్ లు ఆపడం కానీ, దానికి దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కానీ చట్టరీత్యా నేరం అన్నదే ఇంత వరకు మనకు తెలుసు. కానీ ఆంధ్ర బోర్డర్ లో అక్కడి నుంచి ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ వస్తున్న అంబులెన్స్ లును తెలంగాణ పోలీసులు నిలిపివేసారు. ఇది ఎంత వరకు చట్టరీత్యా కరెక్ట్ అన్నది క్వశ్చను.

ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రం నుంచి మరే రాష్ట్రానికైనా రోగులను అంబులెన్స్ లో తీసుకెళ్లవచ్చు. మొన్నటికి మొన్న వేరే రాష్ట్రం నుంచి విమానంలో పేషెంట్ ను హైదరాబాద్ కు నటుడు సోనూ సూద్ తరలించారు. మరి ఏ అధికారాలతో తెలంగాణ పోలీసులు అంబులెన్స్ లను బోర్డర్ లో నిలిపివేసారు అన్నది సందేహం.

తెలంగాణలో లాక్ డౌన్ వుందా? లేదు. మరెందుకు ఆపేసినట్లు?

ప్రభుత్వం నుంచి అధికారికంగా అలాంటి ఆదేశాలు వచ్చినట్లు ఎక్కడా వార్తలు లేవు. 

పోనీ హైదరాబాద్ లోకి రావడానికి ఈపాస్ సిస్టమ్ స్టార్ట్ చేసినట్లు కూడా వార్తలు లేవు

అసలు హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానినా? విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హక్కు ఇంకా వుంది. 

సరే దీని మీద ఎవరైనా కోర్టుకు వెళ్లోచ్చు. గెలవచ్చు. లేదా మరేదైనా జరగొచ్చు. కానీ ఈలోగా కొన్ని ప్రాణాలైనా పోతాయి కదా? ఈ యాంగిల్ లో, మానవత్వ దృక్పధంతో పోలీసులు,  పాలకులు ఆలోచించకపోతే ఎలా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?