Advertisement

Advertisement


Home > Politics - Gossip

వెంటనే మరో చైర్మన్.. అపోహలకు నో చాన్స్!

వెంటనే మరో చైర్మన్.. అపోహలకు నో చాన్స్!

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృథ్వీ రాజీనామా చేశారు. తన మీద కుట్ర చేశారని ఆయన ప్రకటించారు. తన స్వరాన్ని అనుకరించి ఆడియో సృష్టించారని అన్నారు. అయినా సరే, ఆరోపణలకు తలొగ్గి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తనను రాజీనామా చేయాల్సిందిగా ఎవరూ కోరలేదని కూడా చెప్పారు. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇంతకంటె భిన్నంగా మరెవ్వరూ కూడా మరో మాట చెప్పలేరు. అచ్చంగా ఎవరి భాష్యమైనా ఇదే తీరుగా ఉంటుంది.

కానీ వాస్తవంలో బయటకు వచ్చిన క్రమం మరో విధంగా ఉంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా, పృథ్వీరాజ్ కు ఫోను చేసి రాజీనామా చేయమన్నట్లుగా వార్తలు వచ్చాయి. అమరావతిలో ఉద్యమాలు చేస్తున్న వారి గురించి పృథ్వీ కామెంట్లపై రెండు రోజుల కిందటే జగన్ ఆగ్రహించిన వైనం కూడా దీనికి జత అయింది. అన్నీ కలిసి ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

కానీ రాజీనామా తర్వాత.. పృథ్వీ మరో మెలిక పెట్టారు. తన మీద విచారణ జరిపించుకోవచ్చునని, తర్వాత తాను మళ్లీ ఎస్వీబీసీ ఛైర్మన్ గా వస్తానని ఆయన ప్రకటించుకున్నారు. తాను నిజాయితీ పరుణ్నని చాటుకోవడానికి ఆయన అలా అని ఉండొచ్చుగానీ.. ఈ వ్యవహారంలో తప్పించుకునే అవకాశం లేదు. ఆడియోను లీక్ చేసినప్పుడే.. తొలి కాల్, ఆయనకు సదరు మహిళ చేసినది కాగా, ఆ వెంటనే పృథ్వీ స్వయంగా తను కాల్ చేసి.. ఐలవ్యూ చెప్పినట్లుగా కాల్ రికార్డు అయింది. స్వరం గురించి మిమిక్రీ చేశారని అనగలరు గానీ.. కాల్ రికార్డు చూస్తే పృథ్వీ దొరికిపోతారు.

అయితే ఇప్పటికే ఆయన ద్వారా పోయే పరువు పోయింది. మళ్లీ పృథ్వీ అదే పదవిలోకి తిరిగి వస్తాడు అనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్లకుండా.. తక్షణమే మరొకరిని అదే స్థానంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించేందుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంటనే మరొకరిని నియమించడానికి అన్వేషిస్తున్నారని సమాచారం. దీనిద్వారా.. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని కీర్తి దక్కుతుందని సర్కారు యోచిస్తుండవచ్చు. తప్పుచేసిన వారికి మహిళలను కించపరిచే వారికి జగన్  జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తుందనే అపోహలు ప్రబలకుండా.. పృథ్వీ విషయంలో కఠినంగానే వ్యవహరించడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?