జగన్మోహన రెడ్డిని ఆడిపోసుకోవడంలో.. తాను ఏం మాట్లాడుతున్నాడో? ఎవరిని కించపరుస్తున్నాడో? తెలియనంతగా జనసేనాని పవన్ కల్యాణ్ బ్యాలెన్స్ తప్పిపోతున్నాడు.
జనాన్ని ఉద్రేకపరచడం ఒక్కటే లక్ష్యంగా మాట్లాడే సినిమా అలవాటు ఉన్న ఈ నటుడు.. జగన్‌ను దూషించడానికి కూడా.. అలాంటి చీప్ ట్రిక్కులు వాడుతున్నాడు. అమరావతిలో రాజధాని ఉంటుందా? లేదా? అనే విషయంలో టెన్షన్ పడిపోతున్న పవన్ కల్యాణ్ సీఎం జగన్ ను, మంత్రులను ఉద్దేశించి.. వారి సొంత ఊర్లలో రాజధాని పెట్టుకోవాలని చూస్తున్నారన్నట్లుగా అవాకులు చెవాకులూ పేలుతుండడం విశేషం.
చంద్రబాబునాయుడు స్కెచ్ ప్రకారం.. ఆయన ప్రయోజనాలకు భంగం కలిగితే.. తాను కుమిలిపోతూ ప్రకటనలుగుప్పిస్తూ ఉండే పవన్ కల్యాణ్… రాజధాని విషయంలో కూడా తలాతోకా లేకుండా మాట్లాడుతుండడం ఇవాళ కొత్త కాదు. తొలినుంచి ఆయన ఇదే వైఖరితో ఉన్నారు.
కాకపోతే.. విశాఖలో లాంగ్ మార్చ్ తర్వాత.. ఆ ప్రాంతంలో కులాన్ని నమ్ముకున్నప్పటికీ.. తన పార్టీ ఎందుకంత ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందో, తాను ఎందుకంత నీచంగా ఓడిపోయాడో తెలుసుకోవడానికి సమీక్ష సమావేశాలు పెడుతున్న పవన్ కల్యాణ్.. రాజధాని విషయమై నోరుజారడం.. జగన్ ను నిందిస్తున్నట్లుగా కాదు… రాయలసీమ ప్రాంత ప్రజలను గాయపరుస్తున్నట్లుగా ఉంది.
జగన్ పులివెందులనే రాజధానిగా చేసుకోవాలని, కోర్టు కేసులకు హాజరు కావడానికి కర్నూలులో హైకోర్టు పెట్టాలని పవన్ అంటున్నాడు. అలాగే బొత్సను సీఎం చేస్తే చీపురుపల్లి రాజధాని అవుతుందని కూడా ఎద్దేవా చేస్తున్నాడు. ఇలాంటి చేతగాని మాటలు ఒక నాయకుడిగా పవన్ కు తగవు.
కర్నూలుకు హైకోర్టు కేంద్రం కాగల అర్హత ఎఫ్పటికీ ఉంది. ప్రాంతాల సమతుల్యతను పరిగణనలోకి తీసుకుంటే.. ఆంధ్ర-రాయలసీమ-ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తలా ఒకటి పంచదలచుకుంటే.. రాజధాని- యూనివర్సిటీ- హైకోర్టులను పంచాలి. యూనివర్సిటీ అనేవి ఇప్పుడు అన్నిచోట్లా ఉన్నాయి గనుక… రాజధాని హైకోర్టులను పంచాలి.
ఈ కనీస జ్ఞానం కూడా లేకుండా పవన్ కల్యాణ్ వెటకారపు మాటలు మాట్లాడితే.. ఆయన అజ్ఞానం బయటపడుతుంది. పరువు పోతుంది. సిగ్గు చేటు. జగన్, బొత్సలను ఎద్దేవా చేస్తున్న పవన్ కల్యాణ్ తనను సీఎం చేస్తే గనుక.. తన భార్య అన్నా లెజ్నేవా తరఫున అత్తగారి ఊరు అయిన రష్యాలో.. మన రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేస్తారా? ఇలాంటి దుడుకు మాటలు మానుకోవాలి.