బాబుగారు-బలగం పొట్టి సీతయ్య

అప్పుడెప్పుడో వచ్చిన ప్రతిధ్వని సినిమాలోని బలగం పొట్టి సీతయ్య క్యారెక్టర్ గుర్తుందా? పరుచూరి గోపాలకృష్ణకు పేరు తెచ్చిన పాత్ర. ప్రతి దానికీ డబుల్ స్టేట్ మెంట్ రెడీ చేసే వైనం. ఇప్పుడు ఆ పాత్రనే…

అప్పుడెప్పుడో వచ్చిన ప్రతిధ్వని సినిమాలోని బలగం పొట్టి సీతయ్య క్యారెక్టర్ గుర్తుందా? పరుచూరి గోపాలకృష్ణకు పేరు తెచ్చిన పాత్ర. ప్రతి దానికీ డబుల్ స్టేట్ మెంట్ రెడీ చేసే వైనం. ఇప్పుడు ఆ పాత్రనే గుర్తుకు తెస్తున్నారు మాజీ సిఎమ్ చంద్రబాబు నాయుడు.  డబుల్ స్టేట్ మెంట్లు పడేస్తున్నారు.

నిన్నటి దాకా ఒకటే ఊదరగొట్టడం. బిసిల సీట్లు తగ్గించేసారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారు అంటూ. దాంతో నాలుగు రాజ్యసభ సీట్లు వస్తే రెండు సీట్లు బిసిలకు ఇచ్చి బాబు కు చెక్ చెప్పారు జగన్. దాంతో ఇప్పుడు చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు.

వర్ల రామయ్యను పోటీలోకి దింపారు. ఎందుకు దింపారు. ఓట్లు లేవు కదా? అని అంటే, రాజ్య సభ సీటు వేరే రాష్ట్రం వాళ్లకు ఇచ్చారు. ఎస్సీలకు ఇవ్వకుండా అంటున్నారు. అది ఎలుగెత్తి చాటడానికే ఈ ఎత్తుగడ అంటున్నారు.

బిసిల జపం చేసినపుడు ఎస్సీలు గుర్తు రాలేదు. తను స్వయంగా నిర్మల సీతారామన్ కు, సురేష్ ప్రభుకు రాజ్యసభ సీట్లు ఇచ్చిన సంగతి గుర్తు రాలేదు. ఇప్పుడు నత్వానీకి సీటు ఇస్తే మింగుడు పడడం లేదు. ఎందుకంటే భాజపాకు దగ్గర అవుదాం అనుకున్న తేదేపా ఆశలు అడుగంటిపోయాయి. పోనీ జనసేనను భాజపాకు దగ్గర చేసి, ఆ విధంగా వ్యూహాలు రచిద్దాం అనుకుంటే ఇప్పుడు అది కూడా ఇబ్బందిగా మారుతోంది. అంబానీలకు జగన్ దగ్గర కావడం  ద్వారా రేపు భవిష్యత్ లో తెలుగులో లీడింగ్ మీడియా స్ట్రాటజీ కూడా మారుతుందేమో అన్న అనుమానం ఒకటి వుండనే వుంది. 

ఇవన్నీ కలిసి చంద్రబాబును డబుల్ స్టేట్ మెంట్ ఇచ్చేలా చేస్తున్నాయి.

మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?