కౌంటింగ్ రోజు గందరగోళానికి బాబు స్కెచ్?

టీడీపీ ఏజెంట్లు చివరి వరకూ కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలి, నిరాశతో మధ్యలోనే వెనుతిరగొద్దు. అంతా అయిపోయిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లాలి అంటూ ఉద్భోద చేస్తున్న చంద్రబాబు.. మరో స్కెచ్ కూడా సిద్ధం చేశారని…

టీడీపీ ఏజెంట్లు చివరి వరకూ కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలి, నిరాశతో మధ్యలోనే వెనుతిరగొద్దు. అంతా అయిపోయిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లాలి అంటూ ఉద్భోద చేస్తున్న చంద్రబాబు.. మరో స్కెచ్ కూడా సిద్ధం చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉప్పందింది. అసలే ఫ్రస్టేషన్లో ఉన్న చంద్రబాబు కౌంటింగ్ రోజు శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని, తద్వారా రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందనే సందేశాన్ని బైటకు పంపాలనే దురాలోచనలో ఉన్నారట.

కౌటింగ్ ఏజెంట్లతోనే అల్లర్లు జరిపేందుకు పక్కా వ్యూహాన్ని రచించారట చంద్రబాబు. ఈ మేరకు పార్టీ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమాల్లో రహస్య సందేశాలను వారి చెవికెక్కించారు. ఫలితం తేడా వచ్చి, అంతా అయిపోతుందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆందోళనలకు దిగాలని కౌంటింగ్ కేంద్రాల్లో రణరంగం సృష్టించాలని, అధినేత ఆదేశాలతో ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని చెప్పారట.

ఈ విషయం ఆనోటా ఈనోటా బైటకు రావడంతో ఈసీ అలెర్ట్ అయింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతోనే ఏపీలోనే ఎక్కువ బలగాల్ని మోహరించింది. ఈ అక్కసుతో చంద్రబాబు మరోసారి ఈసీపై విషం కక్కడం ప్రారంభించారు. పోలింగ్ రోజు లేని బలగాలు, కౌంటింగ్ రోజు ఎందుకని.. కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అసలు పోలీసు బలగాలు ఎక్కువుంటే చంద్రబాబుకి వచ్చిన నష్టం ఏంటి? తాను అనుకున్న కార్యక్రమం సజావుగా జరగదనా లేక అసలు అల్లర్లకి అవకాశం లేకుండానే బలగాలు అడ్డుకుంటాయనా? మొత్తమ్మీద కౌంటింగ్ సజావుగా జరగకుండా చేయాలని బాబు ఎన్ని వ్యూహాలు పన్నినా అవన్నీ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. 

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం