Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఇలాంటి వారసుడి కోసమా బాబు ఆపసోపాలు!

ఇలాంటి వారసుడి కోసమా బాబు ఆపసోపాలు!

70 ఏళ్ల వయసులో కాలికి బలపం కట్టుకుని ఊరూరూ తిరిగొస్తున్నారు చంద్రబాబు. ఓటమి భయం వెంటాడుతున్న వేళ చంద్రబాబు ఎక్కే గడపా, దిగే గడపా లెక్కేలేవు. అధికారం కోల్పోతున్న దశలో ఆపసోపాలు పడుతున్న చంద్రబాబుకి అసలు సిసలు వారసుడు ఎలా ఉండాలి. అన్ని విషయాల్లో అండగా నిలవాలి. అతడితో పాటే కలిసి తిరగాలి. కానీ లోకేష్ లో అలాంటి దాహంలేదు, ధైర్యం అంతకంటే లేదు. అందుకే ఇంటికే పరిమితమయ్యారు చినబాబు.

ఎన్నికలు పూర్తై నెలా పది రోజులవుతోంది, ఫలితాలు కొన్నిగంటల వ్యవధిలో వచ్చేస్తాయి.. ఇంకా లోకేష్ మాత్రం బైటకు రాకుండా కాలం గడుపుతున్నారు. ఈవీఎంలపై తండ్రి చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఒక్క మాటా మాట్లాడలేదు, అసలు తండ్రి అంత ఇదైపోతుంటే.. కొడుకు మాత్రం పెళ్లిళ్లు పేరంటాలకు హాజరవుతూ, షాప్ ఓపెనింగ్ లకు చీఫ్ గెస్ట్ గా వెళ్తూ, రాళ్లపల్లి మరణానికి చింతిస్తూ, ఆర్థర్ కాటన్ జయంతికి కామెంట్లు పెడుతూ, ఇఫ్తార్ విందుల్లో కనిపిస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇవన్నీ ట్విట్టర్ లోనే.

నిజంగా చంద్రబాబు ఫీలవ్వాల్సిన సందర్భం ఏదైనా ఉందంటే.. అది అధికారం పోతున్నందుకు కాకూడదు, ఇంకెప్పటికీ టీడీపీ అధికారంలోకి రాలేదేమోననే భయంతో అయి ఉండాలి.. నందమూరి కుటుంబం చేతిలో నుంచి లాగేసుకున్న పార్టీ పగ్గాలు, నారావారి కుటుంబానికి శాశ్వతం కావేమో అనే ఆవేదనతోనే అయి ఉండాలి.

ఇప్పటికే కొడుకు ప్రతిభపై చంద్రబాబుకి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. అందుకే అతని మైక్ కట్ చేశారు. లోకేష్ మాట్లాడటం కంటే మౌనంగా ఉంటేనే పరువు దక్కుతుందనేది చంద్రబాబు ప్రగాఢ నమ్మకం. పోనీ మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడన్నా ఆయన పెదవి విప్పాలి కదా, నాన్నారు చెప్పారు నోరు తెరవను అంతే అంటూ భీష్మించుకుని కూర్చున్నారు.

లోకేష్ వాలకం చూసి ఇలాంటి వారసుడి కోసమా చంద్రబాబు ఇంతలా ఆపసోపాలు పడుతోంది అనుకొంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. రేపు నిజంగా పార్టీ పగ్గాలు చినబాబు చేతికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?