గొప్పలు మీకు.. తిప్పలు జగన్ కా..!

కియా కార్ల ఉత్పత్తి ప్రారంభమయితే ఆ గొప్ప టీడీపీ ప్రభుత్వానిది, మరీ ముఖ్యంగా చంద్రబాబు దార్శనికత అని గొప్పలు చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. స్వయానా చంద్రబాబు కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఫొటో…

కియా కార్ల ఉత్పత్తి ప్రారంభమయితే ఆ గొప్ప టీడీపీ ప్రభుత్వానిది, మరీ ముఖ్యంగా చంద్రబాబు దార్శనికత అని గొప్పలు చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. స్వయానా చంద్రబాబు కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఫొటో షేర్ చేసి సొంతడబ్బా కొట్టుకుని, జగన్ సర్కారుపై అక్కసు వెళ్లగక్కారు. పోనీ ఆ క్రెడిట్ బాబునే తీసుకోమందాం. మరి రాష్ట్రంలో విత్తన కొరతతో రైతుకష్టాలు, జీతాలకోసం రోడ్డెక్కిన ఉద్యోగుల బాధలు ఇవన్నీ.. జగన్ ఖాతాలోకి ఎలా వెళ్తాయి.

మొన్నటికి మొన్న వరద ప్రాంతాల్లో పర్యటించిన లోకేష్, కాల్వల్లో పూడిక తీయకపోవడం వల్లే వరదనీరు పొలాల్లోకి పోటెత్తిందని ఈ పాపమంతా వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఒకరోజు తర్వాత కియా కంపెనీ విషయంలో చంద్రబాబు ఆ గొప్ప అంతా తమదేనంటున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో కాస్తో కూస్తో పనులు జరిగితే అది టీడీపీ గొప్పతనం, ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అనర్థాలకు ఫలితాలు వైసీపీ వచ్చిన తర్వాత బయటపడిదే అది జగన్ తప్పు. ఇదెక్కడి లాజిక్. చంద్రబాబే దీనికి వివరణ ఇవ్వాలి.

విడతల వారీగా జగన్ పింఛన్లు పెంచుతున్నారంటూ రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు.. అసలు రుణమాఫీలో ఎందుకు ఇన్ స్టాల్ మెంట్ స్కీమ్ పెట్టారో సమాధానం చెప్పాలి. 2014 ఎన్నికల్లో రుణమాఫీ ప్రధాన అజెండాగా గట్టెక్కిన టీడీపీ ఆ తర్వాత విడతల వారీగా అంటూ మెలిక పెట్టింది. ఐదేళ్లు పూర్తయినా కూడా ఇంకా రుణమాఫీ పూర్తి చేయకపోవడంకంటే దౌర్భాగ్యం ఇంకేదయినా ఉంటుందా. మిగిలిన రెండు విడతలు జగన్ మాఫీ చేయాలట.

అంటే రుణమాఫీ హామీతో అధికారం వెలగబెట్టింది టీడీపీ అయితే, ఆ పాపాన్ని మోయాల్సిన భారం వైసీపీ ఎందుకు భుజానికెత్తుకోవాలి. వైసీపీ అధికారంలోకి రాగానే.. తన తప్పులన్నిటినీ జగన్ పై నెట్టడం ఎంతవరకు సబబు. గొప్పలు టీడీపీకి, తిప్పలు వైసీపీకి.. ఇదెక్కడి లాజిక్. 

కుదిరితే వైసీపీ లేదంటే బీజీపీ.. మరోవైపు సోదరుడి చీలిక