Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆ రకంగా మద్దతును కొనుక్కున్నారా?

ఆ రకంగా మద్దతును కొనుక్కున్నారా?

జమ్మూ కాశ్మీరుకు ఉన్న స్వయంప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మెజారిటీ మద్దతు దేశవ్యాప్తంగా లభిస్తూనే ఉంది. విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా దీనికి మద్దతు పలుకుతున్నారు. జ్యోతిరాదిత్య, జనార్దన్ ద్వివేది లాంటి కీలకనాయకులు కూడా బిల్లను సమర్థించడం విశేషం. అయితే అదే కాంగ్రెస్ పార్టీనుంచి ఇప్పుడు మరో భిన్నమైన స్వరం వినిపిస్తోంది. భాజపా- డబ్బులిచ్చి మద్దతు కొనుక్కుంటున్నదంటూ విమర్శలు చేస్తున్నారు.

ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. రాజ్యసభలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన గులాం నబీఆజాద్. ఈ బిల్లును అడ్డుకోడానికి విఫలయత్నం చేసిన ఆజాద్, శ్రీనగర్ వెళ్లి అక్కడ సభలు పెట్టడానికి చేసిన ప్రయత్నాలను కూడా సైన్యం అడ్డుకుని తిప్పి ఢిల్లీ పంపింది. ఈ సందర్భంగా భాజపాకు దేశమంతా మద్దతు లభిస్తున్నది కదా అని మీడియా ప్రశ్నించినప్పుడు.. డబ్బులిస్తే ఎవరి మద్దతునైనా కొనుక్కోవచ్చు అని గులాం నబీఆజాద్ వ్యాఖ్యానించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంకుచిత భావజాలం గల నాయకుల చేతిలో ఇన్నాళ్లుగా ఇరుక్కుపోయి ఇన్నేళ్లుగా సతమతమవుతున్నదనడానికి ఇదే నిదర్శనం. ప్రజల ఆలోచనలు, కోరికలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా.. తమ తమ వ్యక్తిగత భావజాలాలూ స్వార్థాపేక్షలతో ముడిపెడుతూ.. రాజకీయ విధానాలను రూపొందించుకునే పెద్దపీట వేయడం వల్లనే ఆ పార్టీ ప్రజల తిరస్కారానికి గురవుతూ వస్తోంది.

కాశ్మీర్ లో కొందరు ప్రజలు, కొందరు నాయకులు 370 రద్దును సమర్థించారని అంటే.. వారికి డబ్బు ఇచ్చి మద్దతును కొనుక్కున్నారంటూ గులాం నబీ ఆజాద్ వెకిలి కామెంట్లు చేయడం ఒక ఎత్తు.  మరి కాశ్మీరుతో ఎలాంటి సబంధంలేకపోయినా.. దేశంమొత్తంలోని ప్రజలంతా దీనిని హర్షిస్తున్నారే.. ఎందరు ప్రజలకు పార్టీ డబ్బులిచ్చి మద్దతు కొనుక్కుంటున్నదని అనుకోవాలి? బాధ్యత గల సీనియర్ నాయకుడిగా.. ఒక విధానం మీద విమర్శ చేసే ముందు... నోరు పారేసుకునే ముందు తన మాటల్లోని ఔచిత్యం ఏమిటో గులాంనబీ లాంటి వాళ్లు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అలాంటి అలవాటు లేకుంటే.. ఇక ఎప్పటికీ వారు ప్రజల మనసులు గెలుచుకోలేరు.

కుదిరితే వైసీపీ లేదంటే బీజీపీ.. మరోవైపు సోదరుడి చీలిక

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?