Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఇంకా తెలంగాణను తిడుతూ బతకడమేనా?

ఇంకా తెలంగాణను తిడుతూ బతకడమేనా?

చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ.. ఆయన ఈ దశలో, ఈ వయసులో ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. రాష్ట్రం విడిపోయి అయిదేళ్లయింది. ఇప్పుడు ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. ఇంకా మోకాలికీ బోడిగుండుకీ ముడిపెడుతున్నట్లుగా... రాజధాని తరలింపు వ్యవహారాన్ని తెలంగాణ వారికి ముడిపెడుతూ... ఒక దుష్ప్రచారం సాగిస్తూ... దానిద్వారా తాను రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం మాత్రం ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ రైతుల జేఏసీ సాగిస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా ఆయన స్వయంగా రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. అమరావతి కోసం, అక్కడ రాజధాని నగరం కోసం, నిర్మాణాలు చేయడం కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇంత కష్టం ఎన్నడూ చేయలేదు గానీ, ఇప్పుడు ఊరూరా తిరిగి జోలె పడుతున్నారు. ప్రజలనుంచి అమరావతి ప్రాంత పోరాటం కోసం చందాలు సేకరిస్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది.

అమరావతి పోరాటానికి ఆర్థికంగా సాయం చేయదలచుకుంటే.. అందుకు రాష్ట్రంలో తాను తిరిగిన ప్రాంతాలనుంచి చందాలు తీసుకోదలచుకుంటే అది ఆయన ఇష్టం. పోరాటానికి ఏదో చంద్రబాబు జోలెలో డబ్బు వేయడం కాకుండా, ఇతరత్రా కూడా ప్రజలు మద్దతు ఇస్తారా లేదా అనేది వేర్వేరు కారణాల మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబుకు చేతనైతే.. ప్రజల్లో అమరావతి రాజధాని అనే అంశం పట్ల సదవగాహన కలిగించాలి. కానీ ఆయన విద్వేష వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు.

‘ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయిందని తెలంగాణ వాళ్లంతా నవ్వుకుంటున్నారు’ అనేది చంద్రబాబునాయుడు తాజాగా తిరుపతిలో చెప్పిన మాట. ‘ఏపీకి బాగా జరిగిందని కనీసం రాజధాని కూడా నిర్మించుకోలేని అసమర్థులు’ అని తెలంగాణ వాళ్లు అనుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలంగాణ వాళ్లు ఆయనకు చెవిలో చెప్పారా? ఎవరైనా కొందరు వ్యక్తులు అలాంటి కామెంట్లు చేసి ఉండొచ్చు.. దానిని సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు తెలంగాణ సమాజానికి ఎలా పులుముతారు? ఇలాంటి మాటలు తెలంగాణ సమాజం పట్ల ప్రజల్లో ద్వేషం పెంచుతాయని ఆయనకు తెలియదా? అని ప్రజలు అనుకుంటున్నారు.

తన రాజకీయ స్వార్థ స్వప్రయోజనాల కోసం... తెలంగాణ మీద విషం చల్లే వ్యాఖ్యలను నమ్ముకోవడాన్ని చంద్రబాబునాయుడు దిగజారుడు రాజకీయంగా ప్రజలు అభివర్ణిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?