బాబుగారి సమీక్షల్లో కాంగ్రెస్‌ గోలేంటి.?

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజా ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల ద్వారా చంద్రబాబు, పార్టీ విజయావకాశాలపై ఓ అంచనాకి రాబోతున్నారు. 'మేం 150 సీట్లలో…

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజా ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల ద్వారా చంద్రబాబు, పార్టీ విజయావకాశాలపై ఓ అంచనాకి రాబోతున్నారు. 'మేం 150 సీట్లలో గెలవబోతున్నాం..' అని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించేసుకున్నా, వాస్తవ పరిస్థితేంటో ఆయనకి బాగా తెలుసు. పోలింగ్‌కీ, ఫలితాలకీ మధ్య గ్యాప్‌ చాలా ఎక్కువగా వుండడంతో, ఎలా టైమ్‌ పాస్‌ చెయ్యాలో తెలియక జాతీయ స్థాయిలో హడావిడి చేస్తూ, అప్పుడప్పుడూ రాష్ట్రంలోని పరిస్థితులపై రాజకీయ సమీక్షలు చేస్తూ.. ఎప్పుడూ వార్తల్లో వుండేందుకు తన ప్రయత్నం తాను చేస్తున్నారు ఈ సీనియర్‌ పొలిటీషియన్‌.

కానీ, ఏం లాభం.? పార్టీ ముఖ్యనేతలే చంద్రబాబుని లైట్‌ తీసుకుంటున్నారు. పార్టీ సమీక్షలకి కొందరు డుమ్మా కొడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పరిస్థితులపై సమీక్ష జరిపిన చంద్రబాబుకి కొందరు సీనియర్‌ నేతలు ఝలక్‌ ఇచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుండా లక్ష్మిదేవి వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి హాజరుకాకపోగా, రకరకాల వంకలు పెట్టి, మరికొందరు సమీక్షకు గైర్హాజరయ్యారు. దాంతో, చంద్రబాబు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారట.

అన్నట్టు, ఈ సమీక్షల్లో 'కాంగ్రెస్‌తో మైత్రి' గురించి చంద్రబాబు పదే పదే చెప్పుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేశామని పార్టీ నేతలు నమ్మేలా చంద్రబాబు నానారకాల స్టంట్లూ చేస్తున్నారు. మోడీ ఇమేజ్‌ని జాతీయ స్థాయిలో తగ్గించగలిగామంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకి టీడీపీ నేతలే నవ్వుకుంటోన్న పరిస్థితి. ఇంకా చిత్రమైన విషయమేంటంటే, రాజీవ్‌ గాంధీని చంద్రబాబు వెనకేసుకొస్తుండడం. కాంగ్రెస్‌ పార్టీ పట్ల చంద్రబాబు చూపుతున్న విపరీతమైన అభిమానం టీడీపీ నేతలకు మింగుడుపడ్డంలేదు.

'ఇవి టీడీపీ సమీక్షలా? కాంగ్రెస్‌ తరఫున భజన కార్యక్రమాలా.?' అంటూ ఏపీకి చెందిన ఓ టీడీపీ సీనియర్‌ నేత, తన సన్నిహితుల వద్ద వాపోయారట. 'సమీక్షలంటే, పార్టీ జయాపజయాల గురించి చర్చించుకోవాలి. కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలి. మనం ఓడిపోతే, కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సి వస్తుందనీ.. గెలిచినా కాంగ్రెస్‌ని మిత్రపక్షంగానే భావించాలనీ.. కార్యకర్తల్ని ఇంకొకరికి బానిసలుగా మార్చే ప్రయత్నం చేయడమేంటి.?' అన్నది సదరు సీనియర్‌ నేత ఆవేదన.

పాపం.. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ.. చంద్రబాబు పరిస్థితి ఇప్పుడెంతలా దిగజారిపోయిందో కదూ.!  

బాలకృష్ణ..ఎమ్మెల్యేగా గెలవాలంటే అదే జరిగుండాలి!