Advertisement

Advertisement


Home > Politics - Gossip

బట్టలిప్పేస్తున్న దిలీప్ సుంకర

బట్టలిప్పేస్తున్న దిలీప్ సుంకర

ఇప్పటి వరకు సెలబ్రిటీలను పోలిన నటులను తీసుకురావడం, వాళ్లతో సెటైరికల్ పాత్రలు పోషింపచేయడం దర్శకుడు ఆర్జీవీకే చెల్లు. అలాంటి ప్రయత్నం మరెవరు చేయలేదు.పైగా చేయాలంటే భయం కూడా. 

అలాంటిది దిలీప్ సుంకర గత రెండు వారాలుగా చేసి వదుల్తున్న విడియోలు సంచలనంగా మారుతున్నాయి. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు రాస్తారు.

ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఇంటర్వూలు చేస్తారు. ఈ రెండింటిని, ప్లస్ ఆర్కేను టార్గెట్ చేస్తూ, లీగల్ సమస్యలు రాకుండా చూసుకుంటూ దిలీప్ సుంకర విడియోలు చేసి వదుల్తున్నారు. 

అచ్చం ఆర్కే మాదిరిగా హావభావాలు ప్రదర్శిస్తూ, నటిస్తూ, పైగా మాట్లాడగలిగిన వ్యక్తిని తీసుకువచ్చారు. కేవలం వ్యక్తిని తీసుకురావడం, నాలుగు డైలాగులు చెప్పించడం  కాదు. 

ఇటు దిలీప్ సుంకర, అటు ఆర్కే పాత్ర ధారి సమానంగా డిస్కషన్లు సాగించడం విశేషం. సోషల్ మీడియాలో ఈ విడియోలు సంచలనంగా మారుతున్నాయి. వేలాది కామెంట్లు వచ్చి పడుతున్నాయి. 

మొత్తం మీద దిలీప్ సుంకర తన టాలెంట్ ను ఈ విధంగా ప్రదర్శిస్తున్నారు. వైకాపా, జనసేన, తేదేపా వీటి మధ్య ఆర్కే వ్యవహారాలు ఇలా ఒకటి కాదు సమస్తం ఈ విడియోల్లో బట్టబయలు చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?