Advertisement

Advertisement


Home > Politics - Gossip

సీబీఐకి జగన్‌ రెడ్‌ కార్పెట్‌.. బాబుకి టెన్షనే!

సీబీఐకి జగన్‌ రెడ్‌ కార్పెట్‌.. బాబుకి టెన్షనే!

సీబీఐ లాంటి కేంద్ర సంస్థలకు సంబంధించి రాష్ట్రాలు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తంచేయవు. కానీ, చంద్రబాబు హయాంలో సీబీఐ మీద ఓ స్థాయిలో విషంకక్కిన వైనం చూశాం. అధికారం తన చేతుల్లో వుంది కదా.. అని సీబీఐ రాష్ట్రంలోకి రానివ్వకూడదనుకున్నారు చంద్రబాబు. ఈ మేరకు అడ్డగోలుగా జీవో తీసుకొచ్చి, సీబీఐని అడ్డుకున్నట్లు బిల్డప్‌ ఇచ్చేశారు. అయితే, సీబీఐని ఏ రాష్ట్రమూ అడ్డుకునే పరిస్థితి వుండవు. అందుకు ఏ న్యాయస్థానమూ ఒప్పుకోదు. నలభయ్యేళ్ళ రాజకీయ జీవితం తన సొంతమని చెప్పుకుంటారుగానీ.. ఇంత చిన్న లాజిక్‌ని చంద్రబాబు ఎలా మిస్‌ అయ్యారో ఏమో.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ అధికార పీఠమెక్కాక, చంద్రబాబు గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై సమీక్ష మొదలైంది. ఈ క్రమంలోనే, సీబీఐ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చెత్త బుట్టలో పడేసి, సీబీఐకి అనుమతులు మంజూరు చేస్తూ కొత్త జీవో జారీచేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. దాంతో, సీబీఐ సాధారణ సమ్మతితోనే ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలు కలిగిందిప్పుడు.

టీడీపీ - బీజేపీ మధ్య బంధం తెగాక, సీబీఐ మీద అపారమైన వ్యతిరేకత పెంచుకున్న చంద్రబాబు, ఏడాదికాలం పాటు సీబీఐ మీద చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. మరిప్పుడు, సీబీఐ గనుక ఏదన్నా కేసులో తనను విచారించేందుకు వస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటట.? చంద్రబాబు సంగతెలా వున్నా, టీడీపీకి చెందిన చాలామంది ముఖ్యనేతల మీద సీబీఐ కన్నుపడ్డ మాట వాస్తవం. ఆల్రెడీ సీబీఐ తలనొప్పిని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి గట్టిగానే ఎదుర్కొంటున్నారాయె.

ఒకప్పుడు చంద్రబాబు ఇదే సీబీఐ మీద బోల్డంత నమ్మకాన్ని ప్రదర్శించేశారు. వైఎస్‌ హయాంలో ప్రతి చిన్న విషయానికీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసిన విషయం విదితమే.

పరిటాల శ్రీరామ్..చలో సింగపూర్ అంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?