వారి దాడితో… చంద్రబాబు అవాక్కయ్యారా?

ఇదివరకు పరిస్థితి ఇలా ఉండేదికాదు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమేకాదు… 2014 తర్వాత పదేళ్లపాటు అధికారంలో లేనప్పుడు కూడా చంద్రబాబు ఎదుట గట్టిగా మాట్లాడడానికి పార్టీ నాయకులు జంకేవాళ్లు. అధినేతకు ప్రియంగా ఉండే మాటలు మాత్రమే…

ఇదివరకు పరిస్థితి ఇలా ఉండేదికాదు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమేకాదు… 2014 తర్వాత పదేళ్లపాటు అధికారంలో లేనప్పుడు కూడా చంద్రబాబు ఎదుట గట్టిగా మాట్లాడడానికి పార్టీ నాయకులు జంకేవాళ్లు. అధినేతకు ప్రియంగా ఉండే మాటలు మాత్రమే మాట్లాడేవాళ్లు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు కాస్త చేదుగా కనిపించినా సరే… వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ఎందుకింత ఘోరంగా ఓడిపోయాం అని సమీక్షించుకోవడానికా? అన్నట్లుగా చంద్రబాబు ఓ మీటింగ్ పెడితే… పార్టీ వాళ్లు ఎడాపెడా ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఆయనకు ఏకరవు పెట్టారు. పార్టీలో ఏయే నాయకుల వలన చేటు జరిగిందో కూడా ఆయనకు సవివరంగా చెప్పారు. ఇంచుమించుగా తన మీద పార్టీలోని మరొక గ్రూపు విమర్శల దాడి చేస్తున్న స్థాయిలో… తన ఎదుటే, నిన్నటిదాకా తనముందు తోకాడిస్తూ ఉండిన వాళ్లంతా ఒక్కసారిగా విరుచుకు పడేసరికి బహుశా చంద్రబాబునాయుడు అవాక్కయ్యే ఉంటారు!

తను అనుసరించిన ఏయే విధానాలనైతే చంద్రబాబునాయుడు అత్యద్భుతాలని అనుకున్నాడో…  తాను చాలా హైటెక్ పద్ధతులతో నిత్యం పార్టీతో టచ్ లో ఉంటున్నానని భ్రమించాడో.. ఏవైతే తానే కనుగొన్న కీలక అంశాలని ఆయన డప్పుకొట్టుకుంటూ వచ్చాడో… అవన్నీ పార్టీ ఓటమికి కారణాలయ్యాయంటూ నాయకులు ఆయనతో కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. వేలాదిమంది పార్టీ నాయకులతో చంద్రబాబు ఒకేసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తప్పుపట్టారు.

తెదేపాలో మానవసంబంధాలు లేకుండాపోయాయని నిన్నగాక మొన్న వైకాపా నుంచి వచ్చిన జూపూడి ప్రభాకర్ అనేశారు. ఆర్టీజీఎస్ నివేదికలు కొంపముంచాయని మరొకరు.. కోడెల అరాచకాలను ప్రజలు ఛీకొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వంటివి చేటు చేశాయని ఆయనకు నిన్ననే తెలిసివచ్చింది. నలభయ్యేళ్ల సీనియర్ అయిన చంద్రబాబుకు నిన్నటిదాకా అసలు ఈ సంగతులేమీ తెలియవని అనుకోడానికి వీల్లేదు. కాకపోతే.. తనమాటల మాయలో ప్రజల ఓట్లు కొల్లగట్టగలనని ఆయన అనుకున్నారు. అదంతా అబద్దం అని ఇవాళ్టికి తేలిపోయింది. ఇకనైనా జాగ్రత్తపడాలి

ఓటమిపాలైనా తుదిశ్వాస దాకా రాజకీయాల్లోనే – పవన్